New Delhi World Book Fair 2024: సందడిగా న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2024.. హాజరైన ప్రముఖులు
న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2024 అన్ని వయసుల వారిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ బుక్ ఫెయిర్ మరో మూడు రోజులపాటు అంటే ఫిబ్రవరి 18వ వరకు కొనసాగనుంది. ప్రగతి మైదాన్, హాల్స్ 1 నుండి 5 వరకు ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌కు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. పాఠశాల యూనిఫారంలో ఉన్న పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ప్రవేశం ఉచితం. ఇక్కడ నాన్-ఫిక్షన్, ఫిక్షన్, పిల్లల పుస్తకాలు, ఆధ్యాత్మికత, యోగా, ఆరోగ్యం..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2024 అన్ని వయసుల వారిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ బుక్ ఫెయిర్ మరో మూడు రోజులపాటు అంటే ఫిబ్రవరి 18వ వరకు కొనసాగనుంది. ప్రగతి మైదాన్, హాల్స్ 1 నుండి 5 వరకు ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌కు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. పాఠశాల యూనిఫారంలో ఉన్న పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ప్రవేశం ఉచితం. ఇక్కడ నాన్-ఫిక్షన్, ఫిక్షన్, పిల్లల పుస్తకాలు, ఆధ్యాత్మికత, యోగా, ఆరోగ్యం, పురాణాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యక్తిత్వ వికాసం, వ్యాపారం, జీవిత చరిత్ర, ఆత్మకథ, దేశభక్తి, కళ, సంస్కృతి, స్వయం-సహాయం, పాఠ్యపుస్తకాలు, అనుబంధ పఠన సామగ్రి, లెర్నింగ్ మెటీరియల్స్, ఎడ్యుకేషనల్ ఎయిడ్స్, టాయ్-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మెటీరియల్.. వంటి ఎన్నో పుస్తకాలు అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు, తల్లిదండ్రుల నుంచి టీచర్ల వరకు అన్ని వయసుల పాఠకులు పెద్ద సంఖ్యలో బుక్ ఫెయిర్‌ను సందర్శిస్తున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది పుస్తకాల కొనుగోలులో పాఠకులు ప్రత్యేక అభిరుచిని కనబరుస్తున్నారు. తమ మూలాలు, స్వంత సంస్కృతికి అనుసంధానించే పుస్తకాల కోసం ఆసక్తిగా వెతకడం కనిపించింది.
‘ఈసారి పిల్లలు, యువతలో పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగింది. పౌరాణిక పుస్తకాలు ఎక్కువగా కొంటున్నారు. పిల్లలు రామాయణం, మహాభారతాలు చదవాలనుకుంటున్నారు. యువత ప్రాంతీయ భాషల్లో తమ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. యువత ఎక్కువగా సోషల్ మీడియాలో చూసే రీల్స్, పోస్ట్‌ల ఆధారంగా అదే విషయాలపై పుస్తకాలు కూడా చదవడానికి ఇష్టపడుతున్నారు. పుస్తకాలు ఎక్కువగా హిందీ, ఇంగ్లీషులో ప్రచురించి ఉన్నప్పటికీ వారి స్థానిక సంస్కృతికి తిరిగి కనెక్ట్ కావడానికి, గుజరాతీ, మరాఠీ, బంగ్లా ఇతర భాషలతో సహా ఇతర ప్రాంతీయ భాషలలో కూడా పుస్తకాలను ప్రచురించాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ ప్రతియోగిత దర్పణ్ వంటి పోటీ పరీక్షల మ్యాగజైన్ల నుంచి పెంగ్విన్, క్రాస్‌వర్డ్, బ్లూమ్స్‌బరీ వంటి మరెన్నో ప్రచురణలు, నాన్-ఫిక్షన్ పుస్తకాల వరకు పాకిందని’ ఓ వ్యాపారి పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్‌లో భాష అడ్డంకి కాదు
ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కార్నర్‌లో స్పెయిన్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందం స్పానిష్ భాష, ప్రచురణపై ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించింది. అలాగే ప్రజలను కనెక్ట్ చేయడానికి ‘ఎంగేజింగ్ ఎస్పానోల్’ సెషన్ కూడా నిర్వహించబడింది. భాషలకు అతీతంగా ఆస్ట్రియన్ ఎంబసీ ప్రపంచ, డిజిటల్ యుగంలో ఆస్ట్రియన్ సాహి రష్యన్ భాష నుంచి వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించిన రచనలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడ వివిధ బౌద్ధ పుస్తకాలు, జానపద కథలు, శరీర నిర్మాణ శాస్త్రం, రాజకీయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు స్టాల్స్‌లో ఉంచారు. తమిళ సేకరణలు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇక ఇక్కడ హాల్ 3లో ఏకలవ్య పితర ప్రాంతీయ భాషలపై దృష్టి సారిస్తుంది. బుందేల్‌ఖండి, గోండి, కుర్కు వంటి మాండలికాలలో వినూత్నమైన కథలు, పద్యాలను రూపొందించారు. పిల్లలకు కవిత్వం, ప్రకృతి, సైన్స్ అంశాలపై డిబేట్స్ నిర్వహించారు. పుస్తక ప్రదర్శనలో టాయ్-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సృజనాత్మకతను రేకెత్తించే పలు ప్రయోగాత్మక కార్యకలాపాలు, వినూత్న బొమ్మలను అన్వేషించే ‘జాదుయి పితర’ లెర్నింగ్ కిట్ వంటి ఆటవస్తువులు, పునర్వినియోగపరచదగిన కలరింగ్ రోల్స్ రంగురంగుల వాల్‌పేపర్‌లు, ఎనిడ్ బ్లైటన్, షెర్లాక్ హోమ్స్, పెర్సీ జాక్సన్ వంటి విద్యావేత్తల పుస్తకాలు, ఫన్‌రీడ్స్ పుస్తకాలు, పీరియాడికల్‌లు, క్యూరేటెడ్ రేర్ బాక్స్ సెట్‌లు, ఓస్వాల్ బుక్స్, లెర్నింగ్ క్వశ్చన్ బ్యాంక్‌లు, పెగాసస్ ఇలస్ట్రేటెడ్ ఎన్సైక్లోపీడియాలు, బ్రిజ్‌బాసి అంతర్జాతీయ ఇంటరాక్టివ్ ఆర్ట్ సెట్‌లు, పాప్-అప్ పుస్తకాలు.. ఇలా ఒక్కటేమిటి అన్ని వయసుల వారికి పుస్తకాల రూపంలో లెర్నింగ్ మెటీరియల్ లెక్కలేనన్ని ఉన్నాయి.
రచయితల కార్నర్‌లో.. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక యుగంలో జర్నలిస్ట్ జీవితం’ అనే అంశంపై బిజినెస్ వరల్డ్ ఛైర్మన్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ అన్నురాగ్ బాత్రా మాట్లాడారు. ఏఐ సామర్థ్యానికి మించిన అసలైన కంటెంట్‌ని సృష్టించినంత కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నలిజంను స్వాధీనం చేసుకోదని ఆయన అన్నారు. సంస్కృతి గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు గొప్ప మార్గాలని, అవి మనకు సహచరులు, నిజమైన జ్ఞాన ప్రదాతలు అని ఆయన అన్నారు. అలాగే గుజరాతీ, హిందీ, ఉర్దూ, రాజస్థానీ, పంజాబీ భాషలకు చెందిన కేశవ్ తివారీ, వినోద్ శ్రీవాస్తవ, షరీక్ కైఫీ, మదన్ మోహన్ డానిష్, ఉదయన్ థాకర్, అంబికా దత్, సుఖ్‌విందర్ అమృత్ వంటి ప్రఖ్యాత కవుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రఖ్యాత ప్రచురణకర్తలు, స్వతంత్ర పుస్తక విక్రేతలతో సహా మొత్తం 2వేల బుక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ శైలులు, భాషలలో క్లాసిక్ సాహిత్యం నుండి సమకాలీన కల్పన వరకు, విద్యాసంబంధ గ్రంథాల నుంచి పిల్లల పుస్తకాల వరకు ఎన్నో పుస్తకాలకు నెలవైంది. పుస్తకాలను బ్రౌజ్ చేయడం, రచయితలను కలవడంతోపాటు, బుక్ ఫెయిర్‌కు హాజరైనవారు ఫెయిర్‌లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా కల్పించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, సాహిత్య పఠనాల నుంచి వర్క్‌షాప్‌లు, ప్యానెల్ చర్చల వరకు ప్రతి ఒక్కరూ ఆనందించడానికి అనుకూలంగా వినూత్నంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
థీమ్ పెవిలియన్‌లో జరుగుతున్న ఈవెంట్‌లు ఉత్సుకతను రేకెత్తించడం, భారతదేశ భాషా వైవిధ్య సంగ్రహావలోకనం అందించడం, మాతృభాషపై గర్వాన్ని కలిగించడం, జ్ఞానం భాషా సరిహద్దులను దాటిందని తెలియజేయడం.. లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇంగ్లీషు మాత్రమే కాకుండా భారతీయ, యూరోపియన్ భాషలలో అనువాద సంప్రదాయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని భగవద్గీతను స్పానిష్‌లోకి అనువదించిన స్పానిష్ రచయిత ఓస్కార్ పుజోల్ అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ పర్షియన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ అలీమ్ అష్రఫ్ ఖాన్ భారతీయ సాహిత్య దృశ్యంలో పర్షియన్ ప్రాముఖ్యతను వివరించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా భారతదేశంలోని 9 శాస్త్రీయ భాషలలో పర్షియన్‌ను ఒకటిగా గుర్తించినందుకు భారత ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. NDWBF 2024లో ప్రముఖ ప్రముఖులు, పండితులు, సాహిత్యవేత్తలు, అధికారులు, పుస్తక ప్రియులు ఫెయిర్ స్టాల్స్ సందర్శిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.