New Delhi: ఢిల్లీలో మరో దారుణం.. హగ్ చేసుకుని యువతిని కాల్చి చంపిన యువకుడు..
శివనాడార్ వర్సిటీ.. ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం. బడాబాబుల వారసులకు ది బెస్ట్ ఛాయిస్. హై ఫై ఎడ్యుకేషన్ సిస్టమ్. అధునాతన క్యాంపస్. ఫీజు కొద్దీ సౌకర్యాలకు కొదవ వుండదు. సకల సౌకర్యాలతో పాటు 24 గంటలు హై సెక్యూరిటీ వుంటుంది. అంతటి వర్సిటీలో ఒకరి హత్య..
శివనాడార్ వర్సిటీ.. ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం. బడాబాబుల వారసులకు ది బెస్ట్ ఛాయిస్. హై ఫై ఎడ్యుకేషన్ సిస్టమ్. అధునాతన క్యాంపస్. ఫీజు కొద్దీ సౌకర్యాలకు కొదవ వుండదు. సకల సౌకర్యాలతో పాటు 24 గంటలు హై సెక్యూరిటీ వుంటుంది. అంతటి వర్సిటీలో ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్య చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
నేహ.. అనూజ్.. శివనాడార్ వర్సిటీలో బీఏ సోషియాలజీ ధర్డ్ ఇయర్ స్టూడెంట్స్. క్లాస్‌మేట్స్‌గా ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా మూవయ్యేవాళ్లు. ఎప్పట్లానే హాస్టల్ మెస్ దగ్గర మీటయ్యారు. ఫ్రెండ్లీగా ఆమెను హగ్ చేసుకున్నాడు అనూజ్. అంతే ఆ తరువాత ఒక్కసారిగా కాల్పుల సౌండ్‌తో క్యాంపస్ హడలిపోయింది. నేహా నెత్తుటి మడగులో కుప్పకూలింది.
కాల్పులు జరిపింది మరెవరో కాదు మిస్టర్ అనూజ్. నేహాను ఫ్రెండ్లీగా హగ్ చేసుకున్నాడు. ఆ వెంటనే రివాల్వర్ తీసి ఫైరింగ్ చేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సీన్‌లో నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే హాస్టల్ రూమ్‌లో కాల్పుల శబ్దం.. నేహాను కాల్చిన గన్‌తోనే తనను తాను షూట్ చేసుకొని సూసైడ్ చేసుకున్నాడు అనూజ్.
నేహా హత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనా? అసలు క్యాంపస్‌లోకి రివాల్వర్ ఎలా వచ్చింది? అనూజ్‌కు గన్ లైసెన్స్ వుందా? వైడ్ యాంగిల్‌లో విచారణ చేపట్టారు నోయిడా పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..