Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: విశ్వ ఆధ్మాత్మిక నగరి..మన అయోధ్య అదిగదిగో

అయోధ్యలో ఆధ్మాత్మిక మహా సంరంభం. రామ్‌ లల్లా విగ్రహా ప్రతిష్టాపనకు సర్వం సిద్ధం. విశ్వ ఆధ్మాత్మిక నగరంగా అయోధ్య వెలుగులు విరజిమ్ముతోంది. ఎన్నో విశేషాలు..మరెన్నో విశిష్టతలు. భూకంపాలు..సునామీ..ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే..అయోధ్య ఠీవీ ఇంచుమించు మాత్రం కూడా చెక్కు చెదరదు. అయోధ్య అర్కిటెక్చర్‌ను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది మరి.

Ayodhya: విశ్వ ఆధ్మాత్మిక నగరి..మన అయోధ్య అదిగదిగో
Rama Mandir
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 24, 2023 | 8:17 PM

యావత్‌ ప్రపంచం అంతా  ఇప్పుడు  సనాతన భారత్‌ వైపు చూస్తోంది. శతాబ్దాల కల సాకారమవుతోన్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి. 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి రామభక్తలు తరంగాలై తరలి రావడానికి సిద్దమయ్యారు.  అయోధ్య నిర్మాణంలో ఎన్నో విశేతలు విశిష్టతలున్నాయి.చారిత్రక  అంశాలతో పాటు అర్కిటెక్చర్‌లో  అద్భుతమైన సైన్స్‌ దాగుంది.  2 వేల 5వందల ఏళ్లు అంతకు మించి  ఫర్‌ ఎవర్‌ అనేంతగా సాలిడ్‌ స్ట్రక్చర్‌తో అయోధ్య మహాలయం ఠీవీగా కొలువుదీరిందిలా.

అయోధ్య ఆలయ నిర్మాణంలో   సోంపూరా కుటుంబానిది  కీలక పాత్ర. గుజరాత్‌ సోమనాథ్‌ ఆలయ నిర్మాణానికి ప్రభాశంకర్‌ ఓగద్‌ భాయ్‌  చీఫ్‌ ఆర్కిటెక్ట్‌. ఆయన మనవడు ఆశీష్‌ సోంపురా అయోధ్య ఆలయానికి ఆర్కిటెక్‌. సాధారంగా ప్రముఖ చారిత్రక ఆలయాలను నిర్మించేప్పుడు  2వందలు.. మరో 5 వందలు ఏళ్లు మనగుడ సాగించేలా నిర్మిస్తారు. కానీ జబ్‌ తక్‌ సూరజ్‌ చాంద్‌ రహేతా  తబ్‌ తక్‌ అయోధ్య తేజ్‌ రహేగా  అన్నట్టుగా అర్కిటెక్చర్‌ను డిజైన్‌ చేశారు.

లేలేత సూర్య కిరణాలు   రామ్‌లల్లా  చరణాలు స్పృషించేలా గర్బగుడిని అష్టభుజి  ఆకారంలో  డిజైన్‌ చేశామన్నారు ఆశీష్‌ సొంపురా. వేదశాస్త్రాల ప్రకారం విష్ణువుతో అష్టభుజి ముడిపడి వుంటుందన్నారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజిలో ఉండడం మరో విశేషమన్నారాయన. అయోధ్య ఆలయ నమూనా ఇప్పుడు  ప్రపంచా వ్యాప్తంగా  ఐకాన్‌గా మారింది. అయోధ్య  డిజైన్‌  ఎలా చేశారు? విశేషాలంటని  సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. రామయ్య  ప్రతిమతో పాటు అయోధ్య ఆలయ నమూనా  ఇంట్లో వుంటే  శుభప్రదమని భావిస్తున్నారు.  అయోధ్య ఆలయ నమూనాల కోసం కళాకారులకు ఆర్డర్లు  వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

న్యూజిలాండ్లో  మాత్రమే లభించే అరుదైన కలపతో  ఇలా అయోధ్య ఆలయ నమూనాలను తయారు చేస్తున్నారు.  ఇందుకోసం  ప్రత్యేక  టెక్నాలజీని వాడుతున్నారు.  అయోధ్య ఆలయా నమూనా కోసం ముందుగా ప్రధాని మోదీ నుంచి ఆర్డర్‌ వచ్చిందన్నారు . ఇప్పుడు లక్షల్లో ఆర్డర్లు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.  అయోధ్య  ఆలయ నమూనాలు ప్రపంచ నలుచెరుగులకు  చేరుతున్నాయి. రామ్‌లల్లా విగ్రహా  మహా ప్రతిష్టాపన  మహోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది.  నిను చూడని కనులెందుకని అని అనుకునేలా  అయోధ్య  అయోధ్యం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సనాతన భారత్‌  సాక్షత్కారాన్ని కళ్లారా చూసే  భాగ్యం కల్గడం  ..ఇంతకన్నా ఇంకేముంటుంది అదృష్టం.. అని భక్త కోటి పరవశిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కశ్మీర్ నరకంగా మారుతుంది.. సల్మాన్ ఖాన్..
కశ్మీర్ నరకంగా మారుతుంది.. సల్మాన్ ఖాన్..
జున్ను తింటున్నారా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
జున్ను తింటున్నారా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...