సుశాంత్ ది హత్య కాదు, అలా అని చెప్పలేదే ! అంకితా లోఖండే

సుశాంత్ ది హత్య అని తాను ఎప్పుడూ చెప్పలేదని అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే తెలిపింది. అతనిది ఆత్మహత్యే అని స్పష్టం చేసింది. 2016 వరకు అంకిత సుశాంత్ తో డేటింగ్ చేసింది.

సుశాంత్ ది హత్య కాదు, అలా అని చెప్పలేదే ! అంకితా లోఖండే
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 10, 2020 | 10:46 AM

సుశాంత్ ది హత్య అని తాను ఎప్పుడూ చెప్పలేదని అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే తెలిపింది. అతనిది ఆత్మహత్యే అని స్పష్టం చేసింది. 2016 వరకు అంకిత సుశాంత్ తో డేటింగ్ చేసింది. ఆరేళ్ళ డేటింగ్ తరువాత ఇద్దరూ విడిపోయారు. ఇక రియా చక్రవర్తే అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్ఛునన్న వార్తలను, ఊహాగానాలను అంకిత ఖండించింది. పైగా తాను (రియా) ప్రేమించిన వ్యక్తికి ఆమె డ్రగ్స్ ఎలా ఇస్తుందని ఆమె ప్రశ్నించింది. అసలే డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్ కి రియా డ్రగ్స్ ఇఛ్చి అతని మరణానికి కారణమైందన్నఆరోపణని అంకిత ఖండించింది.  పైగా అతడిని రక్షించుకోవాలన్న తాపత్రయం కూడా రియాలో ఉండేదని తెలుసుకున్నానని ఆమె వెల్లడించింది. ఒక విధంగా రియా చక్రవర్తి అరెస్టును అంకిత ఖండించింది. సుశాంత్ కి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని, అతని ఆత్మహత్యకు కారకులైనవారెవరో దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేయాలని ఆమె కోరింది.