ఇప్పటికి 27 ఏళ్లు.. ప్రధాన ప్రాంతాల్లో 144 సెక్షన్..!
బాబ్రీ మసీదు కూల్చి ఇప్పటికి 27 ఏళ్లు పూర్తి అవుతోంది. దీంతో.. యూపీలో.. భద్రతను కట్టుదిట్టం చేసి.. అక్కడ 144 సెక్షన్‌ని విధించారు పోలీసులు. కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైన బలగాలు బాబ్రీ మసీద్ వద్ద మోహరించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అల్లర్లు చెలరేగకుండా చూడాలని.. పోలీసులకు అధికారులు సూచించారు. అంతేకాకుండా.. అనుమానంగా ఉన్న.. 305 మంది నిందితులను.. ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబ్రీ మసీదు విధ్వంస రోజైనా.. డిసెంబర్ 6 ని దేశంలో.. బ్లాక్‌డేగా నిర్వహిస్తున్నారు. […]
బాబ్రీ మసీదు కూల్చి ఇప్పటికి 27 ఏళ్లు పూర్తి అవుతోంది. దీంతో.. యూపీలో.. భద్రతను కట్టుదిట్టం చేసి.. అక్కడ 144 సెక్షన్‌ని విధించారు పోలీసులు. కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైన బలగాలు బాబ్రీ మసీద్ వద్ద మోహరించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అల్లర్లు చెలరేగకుండా చూడాలని.. పోలీసులకు అధికారులు సూచించారు. అంతేకాకుండా.. అనుమానంగా ఉన్న.. 305 మంది నిందితులను.. ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబ్రీ మసీదు విధ్వంస రోజైనా.. డిసెంబర్ 6 ని దేశంలో.. బ్లాక్‌డేగా నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా.. ప్రధాన ప్రదేశాల్లో.. 144 సెక్షన్ విధించారు.
ముఖ్యంగా.. హైదరాబాద్ పాతబస్తీలో.. 150 మంది ఎస్సైలు, 50 సీఐలు, 20 ప్లాటూన్ల బలగాలతో.. పాటు అదనపు పోలీసులు కూడా మోహరించారు. అలాగే.. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఆయా ఏరియాల్లో గట్టి భద్రతలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. దేవాలయాలు.. షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఎక్కడా అల్లర్లు, మత ఘర్షణలు చోటుచేసుకోకుండా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల్లో.. నిఘాను ఏర్పాటు పోలీసులు చేశారు.