పిజ్జా 95,000..ఖాతా ఖాళీ

మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? ఐతే బీ కేర్‌ఫుల్‌. ఎందుకంటే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌కి కుచ్చుటోపీ పెట్టారు సైబర్‌ నేరగాళ్లు. కొందరు కేటుగాళ్ల మాటలు నమ్మి ఏకంగా 95వేల రూపాయలు పోగొట్టుకున్నాడు ఆ ఐటీ ఉద్యోగి. డిసెంబర్‌ 1న బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బెంగళూరులోని కోరమంగళ 1 బ్లాక్‌లో నివాసముండే ఎన్‌వీ షేక్‌ అనే టెకీ..ఓ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పిజ్జా […]

  • Anil kumar poka
  • Publish Date - 12:48 pm, Fri, 6 December 19
పిజ్జా 95,000..ఖాతా ఖాళీ

మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? ఐతే బీ కేర్‌ఫుల్‌. ఎందుకంటే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌కి కుచ్చుటోపీ పెట్టారు సైబర్‌ నేరగాళ్లు. కొందరు కేటుగాళ్ల మాటలు నమ్మి ఏకంగా 95వేల రూపాయలు పోగొట్టుకున్నాడు ఆ ఐటీ ఉద్యోగి. డిసెంబర్‌ 1న బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

బెంగళూరులోని కోరమంగళ 1 బ్లాక్‌లో నివాసముండే ఎన్‌వీ షేక్‌ అనే టెకీ..ఓ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్‌ చేశాడు. 15 నిమిషాల్లో రావలసిన పిజ్జా.. అర్థగంట, గంట ఇలా ఎంతసేపైనా రాకపోవడంతో ఆ యాప్‌కు చెందిన కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేశాడు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అవతలి వ్యక్తి..తాము పిజ్జాలను ఆన్‌లైన్‌లో డెలివరీ చేయడం లేదని..ఆ మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని నమ్మించారు. వెంటనే ఓ లింక్‌ను కూడా పంపించారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేసి ఫోన్‌ పే, బ్యాంక్‌ ఖాతా వివరాలివ్వాలని చెప్పారు. వారి మాయమాటలు నమ్మిన ఆ షేక్‌ వెంటనే బ్యాంక్‌ అకౌంట్‌ డీటెయిల్స్‌ అన్నీ ఎంటర్‌ చేశారు.

ఇదే అతను చేసిన తప్పు. వెంటనే అతని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి 45వేల రూపాయలు దోచేశారు. ఐతే డబ్బు కట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో బాధితుడు అలర్ట్ యేలోపే ఆంధ్రా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మరో 50వేల రూపాయలు కొట్టేశారు. ఇలా మొత్తం 95వేల రూపాయలను కాజేశారు కేటుగాళ్లు. దీంతో మోసపోయానని గ్రహించిన షేక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.