AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్.. 152 ఓట్ల మెజార్టీతో ఘన విజయం

ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయన దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. మరోవైపు, బి సుర్దాసన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయనకు 300 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్.. 152 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
C.p. Radhakrishnan As Vice President Of India
Balaraju Goud
|

Updated on: Sep 09, 2025 | 9:44 PM

Share

ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయన దేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. మరోవైపు, బి సుర్దాసన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయనకు 300 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావల్సిన ఓట్లు 377. పోలైన వాటిలో 15 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్‌ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు.

ఉప రాష్ట్రపతి పదవికి జరిగి ఎన్నికల్లో NDA అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. మొత్తం 781 మంది ఎంపీలలో 14 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తం 767 ఓట్లు పోల్ అయ్యాయి సి.పి. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో సి.పి. రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి, రాజ్యసభ సెక్రటరీ  ప్రకటించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ CP రాధాకృష్ణన్ ప్రతిపక్ష పార్టీ ఇండియా బ్లాక్ అభ్యర్థి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి B సుదర్శన్ రెడ్డిపై ఆధిక్యత సంపాదించారు. పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..