AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. భారత్‌కు బంగ్లాదేశ్ వినూత్న కానుక

గుడ్‌న్యూస్‌.. భారత్‌కు బంగ్లాదేశ్ వినూత్న కానుక

Phani CH
|

Updated on: Sep 09, 2025 | 6:33 PM

Share

దసరా శరన్నవరాత్రుల వేళ.. బంగ్లాదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. దసరా సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు హిల్సా చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.కానీ, ఈసారి ఆ చేపలు దొరకడం కష్టంగా మారటంతో.. 1200 టన్నుల హిల్సా చేపలను భారత్‌కు ఎగుమతి చేసేందుకు బంగ్లాదేశ్ నిర్ణయించింది. ఈ మేరకు బంగ్లా వాణిజ్య మంత్రి అనుమతులు జారీ చేశారు.

అయితే.. నిరుటితో పోల్చితే ఈసారి ఎగుమతి పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించినట్టు తెలుస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు గతంలో షేక్ హసీనా దసరా వేళ.. భారత్‌కు హిల్సా చేపల ఎగుమతిని అనుమతించారు. దీనిని ఆమె‘హిల్సా రాయబారం’గా చెప్పుకున్నారు. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతకు .. హసీనా అనేక సందర్భాల్లో హిల్సా చేపను కానుకగా పంపారు. అలాగే, 2017లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 30 కేజీల హిల్సా చేపను బహుమతిగా హసీనా పంపారు. కాగా, బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వ పతనం,ఆమెకు భారత్ ఆశ్రయం ఇవ్వటంతో ఇరుదేశాల మధ్య గ్యాప్ పెరిగింది. తర్వాత జరిగిన పరిణామల నేపథ్యంలో తొలుత చైనా వైపు మొగ్గిన బంగ్లాదేశ్.. క్రమంగా తన మనసు మార్చుకుంటున్నట్లుగా కనిపించింది. ఈ నేపథ్యంలో దసరా వేళ.. హిల్సా చేపల ఎగుమతి మీద ఉండే నిషేధాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి.. పాత సంప్రదాయాన్ని కొనసాగించటానికే మొగ్గుచూపింది. హిల్సా చేపలు పెరిగే దేశాల్లో బంగ్లాదేశ్‌దే అగ్రస్థానం. బంగాళాఖాతంలోని హెర్రింగ్ జాతికి దగ్గరగా ఉండే ఈ చేప..నదుల్లోనూ పెరుగుతుంది. దీనిని మనం పులస అంటుంటాం. బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న చేపల్లో హిల్సా వాటా 12 శాతం. దేశ జీడీపీలో దీని వాటా ఒక శాతం. ఈ చేప 2017లో జియోగ్రాఫికల్ ఇండికేటర్-జీఐ గుర్తింపు కూడా పొందింది.ఈ చేపను డార్లింగ్‌ ఆఫ్ వాటర్స్, ప్రిన్స్ ఎమాంగ్ ఫిష్‌గా బెంగాలీయులు చెబుతుంటారు. ఈ ఏడాది పంపే కిలో చేప కనీస ఎగుమతి ధరను సుమారు రూ. 1,520 గా నిర్ణయించారు. ఎగుమతిదారులు తమ ట్రేడ్ లైసెన్స్‌లు, పన్ను పత్రాలతో సెప్టెంబర్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కేటాయించిన కోటాను మించకూడదని, అనుమతులను ఇతరులకు బదిలీ చేయరాదని స్పష్టం చేశారు. ఎగుమతిని ఏ దశలోనైనా నిలిపివేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ నిర్ణయంపై భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. దసరాకు ముందు స్నేహానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Araku Coffee: ప్రమాదంలో అరకు కాఫీ తోటలు

హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే

అవి క్షుద్రపూజలు కాదు.. ఆ ఒక్క తప్పే మేం చేసింది

కులమతాలకు అతీతంగా తురకపాలెంలో పూజలకు నిర్ణయం

Gold Price: ఆకాశమే హద్దుగా.. బంగారం ధర