Navjot Singh Sidhu: రూటు మార్చిన నవజ్యోత్‌సింగ్ సిద్ధూ.. కేజ్రీవాల్ ఇంటి ఎదుట ధర్నా.. ఎందుకంటే..?
Navjot Singh Sidhu: వచ్చే ఏడాది పంజాబ్, యూపీ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రధానపార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్‌లో
Navjot Singh Sidhu: వచ్చే ఏడాది పంజాబ్, యూపీ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రధానపార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్‌లో అధికారాన్ని చేపట్టాలన్న సంకల్పంతో కసరత్తులు చేస్తోంది. ఇటీవలనే ఆప్ చీఫ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో పర్యటించి పలు హామీలనుఇచ్చారు. తాము అధికారంలో వచ్చిన వెంటనే పలు పథకాలను చేపడతామంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా కాంట్రాక్టు టీచర్లకు మద్దతు సైతం తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కాంట్రాక్టు టీచర్లను పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు పంజాబ్ అధికార పార్టీ కాంగ్రెస్‌పై పలు విమర్శలు సైతం చేశారు. అయితే.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు.. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రంగంలోకి దిగారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం నిరసన చేశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటి వద్ద ధర్నా చేస్తున్న ప్రభుత్వ గెస్ట్ టీచర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. వారి నిరసనలో సిద్ధూ కూడా పాల్గొని నినాదాలు చేశారు. ఉపాధ్యాయులతో కలిసి ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సిద్ధూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ కాంట్రాక్ట్ మోడల్ అంటూ సిద్ధూ పేర్కొన్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో గత ఐదేళ్లలో నిరుద్యోగం దాదాపు 5 రెట్లు పెరిగిందంటూ ట్విట్ చేశారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ చేస్తున్న విమర్శలను.. సిద్ధూ ఈ విధంగా తిప్పికొట్టారు. ముందు ఇక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సూచించారు. ఢిల్లీలో 1031 పాఠశాలలు ఉంటే, కేవలం 196 స్కూళ్లలోనే ప్రధానోపాధ్యాయులు ఉన్నారని.. 45శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని పేర్కొన్నారు. 22వేల మంది గెస్ట్ టీచర్లతోనే ఢిల్లీ ప్రభుత్వం నెట్టుకొస్తుందంటూ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. గత ఏడేళ్లుగా తమ హామీలను నెరవేర్చని అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్‌లో హామీలు గుప్పిస్తున్నారంటూ గెస్ట్ టీచర్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది.
Also Read: