Jacqueline Fernandez: జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌‌కు కళ్లు చెదిరే గిఫ్ట్స్ ఇచ్చిన సుఖేశ్‌.. ఈడీ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

బడా పారిశ్రామికవేత్తలకు పంగనామం పెట్టిన మాయగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Jacqueline Fernandez: జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌‌కు కళ్లు చెదిరే గిఫ్ట్స్ ఇచ్చిన సుఖేశ్‌.. ఈడీ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
Sukesh Chandrasekhar
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 05, 2021 | 4:25 PM

బడా పారిశ్రామికవేత్తలకు పంగనామం పెట్టిన మాయగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్‌ తారలు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ , నోరా ఫతేహికి కోట్ల విలువైన కానుకలు సుఖేశ్‌ ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. జాక్వెలిన్‌కు అయితే డైమండ్లు , 52 లక్షల విలువైన గుర్రం, 9 లక్షల విలువైన పిల్లిని కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో ఉండడం సంచలనం రేపుతోంది. జాక్వెలిన్‌కు మొత్తం 10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్టు తెలిపారు.

200 కోట్ల వసూళ్ల కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. గత జనవరి నుంచి జాక్వెలిన్‌-సుఖేశ్‌ మధ్య స్నేహం వికసించింది. జైలు నుంచే జాక్వెలిన్‌తో ఫోన్లో మాట్లాడాడు సుఖేశ్‌. కోట్ల విలువైన బహుమతులను ఈ బాలీవుడ్‌ నటికి ఇచ్చాడు. సుఖేశ్‌ బెయిల్‌పై విడుదలైన తరువాత జాక్వెలిన్‌ ఢిల్లీ రావడానికి ముంబై నుంచి ప్రైవేట్‌ విమానాన్ని కూడా పంపించాడు. అంతేకాదు ఇద్దరు ఢిల్లీ నుంచి ప్రైవేట్‌ విమానం లోనే చెన్నైకి వెళ్లారని ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. జాక్వెలిన్‌తో తిరగడానికి 8 కోట్ల చార్టర్‌ విమానం చార్జీలను సుఖేశ్‌ చెల్లించినట్టు కూడా పేర్కొన్నారు. బెయిల్‌పై విడుదలైన తరువాత సుఖేశ్‌ , జాక్వెలిన్‌తో కలిసి చెన్నై లోని ఫైవ్‌స్టార్‌ హోటల్లో విడిది చేసినట్టు కూడా చార్జ్‌షీట్‌లో ఉంది. సుఖేశ్‌ -జాక్వెలిన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

జాక్వెలిన్‌తో పాటు మరో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహిని కూడా వల లోకి లాగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. నోరా ఫతేహికి కోటి రూపాయల విలువైన కారుతో పాటు ఐఫోన్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. సుఖేశ్‌ చంద్రశేఖర్‌ మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఈడీ జాక్వెలిన్‌తో పాటు నోరా ఫతేహిని విచారించింది. అయితే తాను ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికే ఈడీ విచారణకు హాజరైనట్టు వివరణ ఇచ్చారు నోరా ఫతేహి.

సుఖేశ్‌ చంద్రశేఖర్‌ , ఆయన భార్య లీనాపాల్‌పై ఈడీ ఏడు వేల పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను మోసం చేసి 200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌తో పాటు ఆయన భార్య లీనా పాల్ నిందితులుగా ఉన్నారు. జైలు నుంచే ఈ జంట వసూళ్ల దందాను నడిపింది.

Also Read: చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు

అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్