Cheetah Hulchul: షిర్డీ సమీపంలోని శ్రీరాంపూర్‌లో చిరుత టెర్రర్.. ఊరు మొత్తం అతలాకుతలం

షిర్డీ సమీపంలోని శ్రీరాంపూర్‌లో చిరుత అలజడి సృష్టించింది. అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత ఐదుగురిపై దాడి చేసింది.

Cheetah Hulchul: షిర్డీ సమీపంలోని శ్రీరాంపూర్‌లో చిరుత టెర్రర్.. ఊరు మొత్తం అతలాకుతలం
Cheetah Hulchul
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 05, 2021 | 8:11 PM

షిర్డీ సమీపంలోని శ్రీరాంపూర్‌లో చిరుత అలజడి సృష్టించింది. అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత ఐదుగురిపై దాడి చేసింది. చిరుత దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముందుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడింది. వెనుక నుంచి దాడి చేయడంతో ఆ వ్యక్తికి ఏం జరిగిందో అర్ధం కాలేదు. తృటిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.  అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత ఓ ఇంటిపై నక్కింది. చిరుత దాడితో వణికిపోయిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందచేశారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చిరుతను బంధించడానికి ఆపరేషన్‌ చేపట్టారు.

వలలో చిక్కినట్టే చిక్కిన చిరుత అక్కడి నుంచి తప్పించుకుంది. ఫారెస్ట్‌ సిబ్బందితో సహా అక్కడ మరో నలుగురిపై దాడి చేసింది. చివరకు మరోసారి వల లోనే చిక్కింది ఆ చిరుత. దానిపై అటవీశాఖ సిబ్బంది మత్తుమందును ప్రయోగించారు. తరువాత బోనులో బంధించి తీసుకెళ్లారు.  చిరుత హడావిడితో శ్రీరాంపూర్‌లో గ్రామస్థులు కొన్ని గంటలపాటు తెగ టెన్షన్ పడ్డారు.

Also Read:అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్

 చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు