AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Herald Case: ఈడీ ముందుకు రాహుల్‌ గాంధీ.. అనుమతి లేకున్నా ఆందోళనకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi: ఢిల్లీలో AICC ఆఫీస్‌ వద్ద టెన్షన్‌..టెన్షన్‌..కాంగ్రెస్‌ సత్యాగ్రహ్‌ మార్చ్‌..ఎక్కడికక్కడే అరెస్టులు.. ఈడీ ఎదుట హాజరయ్యారు రాహుల్‌గాంధీ. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణకు..

National Herald Case: ఈడీ ముందుకు రాహుల్‌ గాంధీ.. అనుమతి లేకున్నా ఆందోళనకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు
Rahul Gandhi
Sanjay Kasula
|

Updated on: Jun 13, 2022 | 12:27 PM

Share

కాంగ్రెస్‌ సత్యాగ్రహ్‌ మార్చ్‌.. ఎక్కడికక్కడే అరెస్టులు.. ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు రాహుల్‌గాంధీ.  నేషనల్ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. AICC ఆఫీస్‌ నుంచి భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాహుల్‌గాంధీ. ప్రియాంకతో పాటు భారీగా కాంగ్రెస్‌ శ్రేణులు రాహుల్‌కు మద్దతుగా సత్యాగ్రహ్‌ మార్చ్‌ చేపట్టారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణకు రావాలంటూ సోనియా, రాహుల్‌కు(Rahul Gandhi ) సమన్లు జారీ చేసింది ఈడీ. ఈడీ సమన్లపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. మరికాసేపట్లో రాహుల్ ఈడీ కార్యాలయానికి వెళ్లానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ.. ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే అంతకు ముందు రాహుల్ గాంధీ ఇంటి బయట భారీగా పోలీసులను మోహరించడంతో ఈడీ కార్యాలయం వెలుపల కూడా భద్రతను పెంచారు. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. కాంగ్రెస్ నేతల ర్యాలీకి అనుమతి నిరాకరించిన దిల్లీ పోలీసులు.. ఆ పార్టీ కార్యాలయాన్ని బారిగేట్లతో దిగ్బంధించారు. ఢిల్లీ పోలీసులు వద్ద ఉన్న జాబితాలోని సీనియర్ నేతలకే అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటికే మరోవైపు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, సీడబ్ల్యుసీ సభ్యులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌ సత్యాగ్రహ్‌ మార్చ్‌ చేపట్టింది. రాహుల్‌గాంధీ నేతృత్వంలో AICC ఆఫీస్‌ నుంచి ఈడీ కార్యాలయం వరకు గాంధేయమార్గంలో పాదయాత్ర చేపడుతోంది. ఐతే కాంగ్రెస్‌ నిరసన ర్యాలీలకు అనుమతి నిరాకరించిన పోలీసులు..భారీగా బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రాహుల్‌గాంధీ నేతృత్వంలో సత్యాగ్రహ్‌ మార్చ్‌ కొనసాగుతుందంటున్నారు కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్‌ వారు కూడా కాంగ్రెస్‌ గొంతును అణిచివేయలేకపోయారన్నారు. రాహుల్‌ను చూసి మోదీ సర్కార్‌ షేకైపోతోందంటూ కామెంట్‌ చేశారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్