Mysterious Lights: మరోసారి తెరపైకి ఏలియన్స్ చర్చ.. గుజరాత్‏లో మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి.. నిపుణులు ఏమంటున్నారంటే..

ఏలియన్స్ నిజాంగానే ఉన్నారా ? ఉంటే వారికి మనుషుల కంటే ఎక్కువ పవర్ ఉంటుందా ? ఇలాంటి సందేహాలకు ఇప్పటికీ సమాధానాలు మాత్రం దొరకడం లేదు.

Mysterious Lights: మరోసారి తెరపైకి ఏలియన్స్ చర్చ.. గుజరాత్‏లో మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి.. నిపుణులు ఏమంటున్నారంటే..
Mysterious Lights
Follow us

|

Updated on: Jun 23, 2021 | 12:10 PM

ఏలియన్స్ నిజాంగానే ఉన్నారా ? ఉంటే వారికి మనుషుల కంటే ఎక్కువ పవర్ ఉంటుందా ? ఇలాంటి సందేహాలకు ఇప్పటికీ సమాధానాలు మాత్రం దొరకడం లేదు. ఇక ఈ ఏలియన్స్ హడావిడి ఇండియా తక్కువగానే ఉంటుంది. ఇతర దేశాల్లోకి అనేక సార్లు ఏలియన్స్ వచ్చారని రూమర్స్ అనేకం వచ్చాయి. కానీ మన దేశంలో ఆకాశంలో వింతలు, వింత వస్తువులు పెద్దగా కనిపించవు. కానీ గుజరాత్ లోని జునాగఢ్ లో సోమవారం రాత్రి 10 గంటలకు ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అదేంటన్నది ఎక్కరికీ అంతుచిక్కలేదు. రాత్రి, ఆకాశంలో మెరుస్తున్న ప్రకాశవంతమైన లైట్ల వరుసలను చూసి జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. అటు ఇటు కదులుతూ కనిపించింది కాంతి. ఉల్క అయితే అంతసేపు ఆకాశంలో స్థిరంగా ఉండదని తేల్చారు. తారాజువ్వ కూడా క్షణాల్లో కింద పడిపోతుందని భావిస్తున్నారు. ఇంకేముంది అక్కడున్న వారు తమ మొబైల్స్ లో వీడియోలు తీయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీటిలో, సుమారు నాలుగు నుంచి ఏడు ప్రకాశవంతమైన మెరిసే లైట్లు ఒకదాని వెంట ఒకటి లైన్‌గా పయనించాయి. అసహజమైన కాంతి దృశ్యాలు ఏలియన్స్ కాదని, అవి శాటిలైట్స్ అని గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారు ఒకరు చెప్పారు. భూమికి తక్కువ ఎత్తులో పయనించి ఉంటాయని చెబుతున్నారు. అంతరిక్ష శాస్త్రం ప్రకారం అలాంటి కాంతి మూడు సందర్భాలలో కనిపిస్తుందని… ఒక ఉల్కకు సంబంధించిన చిన్న భాగం భూమి ఉపరితలంలోకి ప్రవేశించినప్పుడు ఇలా కాంతి కనిపిస్తుందని చెప్పారు. “కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ లైట్లు కనిపించాయి. ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో 3000 కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను ప్రయోగించినప్పుడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇలా లైట్లు కనిపించాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ట్వీట్..

Also Read: Vismaya death case: వరకట్న వేధింపులకు మరో యువతి బలి.. కన్నీరు పెట్టిస్తున్న కేరళ విస్మయ ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..