తాలిబన్లతో భారత అధికారుల ‘రహస్య’ సమావేశం…….ప్రభుత్వ ప్రకటనకై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్
యూఏఈ లోని దోహాలో భారత అధికారులు చడీచప్పుడు లేకుండా రహస్యంగా తాలిబన్లతో సమావేశమైనట్టు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.
యూఏఈ లోని దోహాలో భారత అధికారులు చడీచప్పుడు లేకుండా రహస్యంగా తాలిబన్లతో సమావేశమైనట్టు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. దీన్ని బీజేపీ ఐటీ విభాగం దేశద్రోహ చర్య కింద పరిగణిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. దోహాలో భారత అధికారులు తాలిబన్ ప్రతినిధులను కలుసుకున్నారని ఖతార్ లోని ప్రత్యేక దౌత్యాధికారి ముల్తాన్ బిన్ మజీద్ అల్-ఖతానీ ఇటీవల ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ డిమాండ్ చేశారు. ఈ పరిణామాలపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా మాట్లాడుతూ..ఇదే గనుక నిజమైతే భారత అధికారులు పాకిస్థాన్ తో సంప్రదించి జమ్మూ కాశ్మీర్ కి అనువైన ఓ తీర్మానం తెచ్చేలా చూడాలని అన్నారు. ఇండియా ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాల్సి ఉందన్నారు. భారత అధికారులు తాలిబన్లతో సమావేశం కావడం బహుశా ఆఫ్ఘనిస్థాన్ పై పట్టు కోసం కాక పోయి ఉండవచ్చునని, కానీ ఆ దేశంలో ఓ కొత్త పొలిటికల్ సెటప్ ఏర్పాటుకోసమై ఉండవచ్చునని ముల్తాన్ వ్యాఖ్యానించారు.కాగా-జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ విషయంలో చొరవ చూపుతున్నట్టు తెలుస్తోందని అంటున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు గత మే 1 నుంచి విడతలవారీగా వైదొలగిన అనంతరం అక్కడ తాలిబన్ల కార్యకలాపాలు పెరుగుతూ వచ్చాయి. అయితే ఇండియా నేరుగా వారితో చర్చలు జరపలేదని, కానీ పరిస్థితి మారినా మారి ఉండవచ్చునని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. అటు ఖతార్ ప్రభుత్వం కూడా భారత ప్రతినిధి బృందం తాలిబన్లతో సమావేశమైనట్టు ధృవీకరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ ఆవేదన..:
విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.