‘నా తల్లి చచ్చిపోతుంది, ఆక్సిజన్ సిలిండర్ తీసేయకండి’, ఆగ్రాలో ఓ వ్యక్తి రోదన ! నిజమేనా ?

ఆగ్రాలో ఓ వ్యక్తి తన తల్లికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ తొలగించవద్దని, తీసేస్తే చచ్చిపోతుందని విలపిస్తూ పోలీసుల కాళ్ళమీద పడ్డాడు. అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు ఈ నెల 27 న కనబడిన దృశ్యమిది !

'నా తల్లి చచ్చిపోతుంది, ఆక్సిజన్ సిలిండర్ తీసేయకండి', ఆగ్రాలో ఓ వ్యక్తి రోదన ! నిజమేనా ?
My Mother Will Die Agra Man
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Apr 29, 2021 | 3:20 PM

ఆగ్రాలో ఓ వ్యక్తి తన తల్లికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ తొలగించవద్దని, తీసేస్తే చచ్చిపోతుందని విలపిస్తూ పోలీసుల కాళ్ళమీద పడ్డాడు. అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు ఈ నెల 27 న కనబడిన దృశ్యమిది ! ఈ సిటీలోని సదర్ హాస్పిటల్ వద్ద ఏ కారణం వల్లో కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను బయటకు చేర్చారు. అయితే కోవిడ్ తో బాధ పడుతున్న తన తల్లిని ఈ ఆసుపత్రిలో అడ్మిట్ చేశానని, కానీ ఆమెనుంచి సిలిండర్ తొలగించారని ఆ వ్యక్తి బావురుమన్నాడు. ఓ సిలిండర్ ను  హాస్పిటల్ నుంచితెచ్చి బయట ఉన్న అంబులెన్స్ లోకి  చేర్చారు ఒకరిద్దరు వ్యక్తులు… కాగా తన తల్లిని తిరిగి తీసుకువస్తానని తన కుటుంబానికి ప్రామిస్ చేశానని, దయచేసి ఆక్సిజన్ సిలిండర్ ని తొలగించవద్దని ఆ వ్యక్తి పోలీసుల కాళ్ళావేళ్ళా పడ్డాడు. మరో సిలిండర్ ను తాను ఎక్కడినుంచి తేవాలని కూడా అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూత్  కాంగ్రెస్ దీన్ని విడుదల చేస్తూ యూపీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని ట్వీట్ చేసింది.  అయితే సీన్ కట్ చేస్తే…పోలీసుల కథనం మరోలా ఉంది. ఆగ్రాలో రెండు రోజుల క్రితం ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, దీంతో కొందరు వ్యక్తులు తమ పర్సనల్ సిలిండర్లను హాస్పిటల్స్ కి ఇస్తున్నారని వారు చెప్పారు.

ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఖాళీగా ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకువెళ్తున్నట్టు ఉందని, కోవిడ్ రోగి అయిన తన తల్లికి కూడా సిలిండర్ ఏర్పాటు చేయాలని మరో వ్యక్తి కోరుతున్నట్టు ఇందులో ఉందని ఆగ్రా ఎస్పీ చెప్పారు. కానీ ఆక్సిజన్ తో నింపిన సిలిండర్లను ఎవరూ బయటకు తీసుకువెళ్లడం లేదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ విధమైన వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..

Bengal Elections Phase-8 Voting LIVE: ప్రశాంతంగా సాగుతోన్న బెంగాల్ చివరి దశ ఓటింగ్.. బారులు తీరిన ఓటర్లు..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.