AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్త.. నన్ను తన పార్టీ నాయకులతో..! అధికార పార్టీ నేతపై మహిళ సంచలన ఆరోపణలు

తమిళనాడులోని డీఎంకే పార్టీ యువజన విభాగం ఉప కార్యదర్శి దేవసేయల్ భార్య తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టమని బలవంతం చేస్తున్నాడని, 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకులకు పంపుతున్నాడని ఆమె ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతానని బెదిరింపులు కూడా ఉన్నాయని ఆమె తెలిపింది.

నా భర్త.. నన్ను తన పార్టీ నాయకులతో..! అధికార పార్టీ నేతపై మహిళ సంచలన ఆరోపణలు
Dmk Youth Wing Leader's Wif
SN Pasha
|

Updated on: May 20, 2025 | 4:04 PM

Share

తమిళనాడుకు చెందిన ఒక మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయా నేతలతో గడపాలని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడని, 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్దకు పంపడమే అతని పని అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ యూత్‌ వింగ్‌ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న దేవసేయల్‌ అనే వ్యక్తి భార్య ఈ ఆరోపణలు చేసింది. 40 ఏళ్ల దేవసేయల్‌.. తనను రాజకీయ నేతలతో గడపాలని హింసిస్తున్నాడని, తాను ఎవరిని చూపిస్తే వారితో గడపాలని టార్చర్‌ చేస్తున్నాడంటూ ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తనను ముక్కలుగా నరుకుతానని బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొంది. ఈ మహిళ చేసిన ఆరోపణలతో ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేతలు ఈ ఆరోపణలపై స్పందించి.. అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.

అరక్కోణం జిల్లాకు చెందిన 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని అయిన ఆ మహిళ, డీఎంకే యువజన విభాగం డిప్యూటీ సెక్రటరీ అని చెప్పుకునే దేవసేయల్ అనే తన భర్త ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుటుంబ సభ్యులను కాల్చి చంపుతానని బెదిరించాడని కూడా చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. “కాలేజీకి వెళ్లే దారిలో అతను నాపై దాడి చేశాడు. నన్ను గాయపరిచాడు, నా ఫోన్‌ను పగలగొట్టాడు. నువ్వు ఫిర్యాదు చేస్తే ఏమీ జరగదు, పోలీసులు నాకు మద్దతు ఇస్తారు అని బెదిరించాడు. అతని కారణంగానే నేను విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాను” అని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది.

అలాగే “20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకులతో పడుకోబెట్టడమే అతని పని. అతనిపై ఎప్పుడూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేను ఫిర్యాదు చేస్తానని చెబితే, నన్ను ముక్కలు ముక్కలుగా నరికివేస్తానని బెదిరించాడు. కారులో నన్ను హింసించి, అతను చూపించిన వ్యక్తులతో పడుకోమని చెప్పాడు. అతని బెదిరింపులతో నేను నా ఇంటిని బయటికి రాలేకపోతున్నాను. దాంతో పరీక్షలకు హాజరు కాలేకపోయాను” అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..