రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే…? శివసేన నేత సంజయ్ రౌత్ ఆగ్రహం…ఎన్సీపీ నిప్పులు

Umakanth Rao

Umakanth Rao | Edited By: Phani CH

Updated on: Jun 17, 2021 | 8:28 PM

మహారాష్ట్రలో వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే...? శివసేన నేత సంజయ్ రౌత్ ఆగ్రహం...ఎన్సీపీ నిప్పులు
Sanjay Raut

మహారాష్ట్రలో వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగమని, ఆ పార్టీ ఎలా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీ ఇలా చేస్తే మిగతా రెండు పార్టీలూ (శివసేన, ఎన్సీపీ) భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని దాని మానాన దాన్ని వదిలేసి మేం కూడా ఇదే పంథా అనుసరిస్తాం అని ఆయన చెప్పారు. పైగా శివసేన ఆధ్వర్యంలోని సామ్నా పత్రిక ఎడిటోరియల్ లో కూడా పటోల్ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని, ఏదైనా మాట్లాడవచ్చునని కానీ.. పటోల్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని ఇందులో ఆరోపించారు. చివరకు మెజారిటీ ఎవరిది అన్నది తేలితేనే ఎవరు సీఎం అవుతారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిని కావాలని అభిలషిస్తారో వారు అవుతారు అని ఈ సంపాదకీయంలో పేర్కొన్నారు. ఎన్సీపీ సీనియర్ నేతలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కామెంట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన నానా పటోల్ ….తమ పార్టీ రానున్న స్థానిక ఎన్నికల్లోనూ, ఆ తరువాత జరిగే శాసన సభ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుందని, హైకమాండ్ ఆదేశిస్తే తాను సీఎం అభ్యర్థిని అవుతానని ప్రకటించారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీఎం కావచ్చు అని వ్యాఖ్యానించారు. కాగా-ఈ విధమైన వ్యాఖ్యలు బీజేపీలో ఆశలు రేకెత్తిస్తాయని , మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో లుకలుకలు తలెత్తాయని ఆ పార్టీ సంబరపడుతుందని శివసేన, ఎన్సీపీ భావిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: CJI NV Ramana: హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న సీజేఐ ఎన్వీ రమణ

Eatala Rajender: వేధిస్తే సహించేది లేదు.. కేసీఆర్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ వార్నింగ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu