AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంట్రాక్టర్‌పై వ్యర్థాలు.. చెత్తను తొలగించడం లేదని శివసేన ఎమ్మెల్యే హుకూం.. వీడియో..

Mumbai Shiv Sena MLA Dilip Lande: ముంబైలో గత నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎటుచూసినా వ్యర్థాలు, మురుగు నీరే

కాంట్రాక్టర్‌పై వ్యర్థాలు.. చెత్తను తొలగించడం లేదని శివసేన ఎమ్మెల్యే హుకూం.. వీడియో..
Shocking Video
Shaik Madar Saheb
|

Updated on: Jun 13, 2021 | 12:38 PM

Share

Mumbai Shiv Sena MLA Dilip Lande: ముంబైలో గత నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎటుచూసినా వ్యర్థాలు, మురుగు నీరే దర్శనమిస్తోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయని కాంట్రాక్టర్‌పై స్థానిక ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్‌ను చెత్తలో కూర్చోబెట్టి కాలువ వ్యర్థాలను మీద వేయించారు. డ్రైనేజీ క్లీన్ చేయలేదని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే.. దిలీప్ లాండే అక్కడే ఉండి.. శివసేన కార్యకర్తలతో ఈ పనిని చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని చండీవాలి ప్రాంతంలో శనివారం ఈ సంఘటన జరిగింది.

వీడియో..

దీనిపై ఎమ్మెల్యే దిలీప్ లాండే మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ గత కొన్ని రోజులుగా డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో నీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోజుల తరబడి ఫిర్యాదు చేసినా.. స్పందించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో శనివారం చెత్తను తొలగించేందుకు తన కార్యకర్తలతో వెళ్లగా.. కాంట్రాక్టర్ కూడా అక్కడకు వచ్చాడన్నారు. సరిగా పనిచేయకపోతే.. ఏం జరుగుతుందో చూపించడానికి తాను అలా చేయించినట్లు పేర్కొన్నారు. ఓ ప్రజా ప్రతినిధి ఇలా చేయవచ్చా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు వేరే మార్గం లేదని.. ఇలా చేయడం ఏమాత్రం తప్పు కాదంటూ దిలీప్ లాండే సమాధానం చెప్పారు.