ముకేశ్ అంబానీ ఇంటివద్ద పీపీఈ కిట్ ధరించి వాహనాన్ని పార్క్ చేసిన ఆగంతకుడెవరు ?

గత నెల 25 న  పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పార్క్ చేసినట్టు భావిస్తున్న వ్యక్తిని  సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఆ వ్యక్తి పీపీఈ కిట్ ధరించాడు.

ముకేశ్ అంబానీ ఇంటివద్ద పీపీఈ కిట్ ధరించి వాహనాన్ని పార్క్ చేసిన ఆగంతకుడెవరు ?

గత నెల 25 న  పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పార్క్ చేసినట్టు భావిస్తున్న వ్యక్తిని  సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఆ వ్యక్తి పీపీఈ కిట్ ధరించాడు. 20 జిలెటిన్ స్టిక్ లతో కూడిన స్కార్పియో వాహనాన్ని ఆ వ్యక్తి అంబానీ నివాసం..’యాంటీలియా’ వద్ద పార్క్ చేసి తను మరో వాహనంలో వెళ్ళిపోయాడు. గత నెల 18 న ఈ స్కార్పియోను ములుంద్-బ్రిడ్జి ప్రాంతంలో దొంగిలించారని పోలీసులు తెలిపారు. అయితే అంతకు ముందు ఎస్యూవీ కారును వాడిన  మాన్ సుఖ్ హీరేన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం మిస్టరీగా ఉందని వారు చెప్పారు. బహుశా ఆ వ్యక్తికి, ఈ పీపీఈ కిట్ ధరించిన వ్యక్తికి సంబంధాలు ఉన్నాయా అన్న విషయం తెలియడంలేదని, దర్యాప్తు చేస్తున్నామని వారు చెప్పారు.

స్కార్పియో కారులో ఒక్కక్కటి 2.5 కేజీల బరువున్న 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయని వారు తెలిపారు. వీటితో బాటు అంబానీని, అయన భార్యను హెచ్చరిస్తూ రెండు లేఖలను కూడా ఖాకీలు కనుగొన్నారు. తమకు భారీగా సొమ్ము (బిట్ కాయిన్ల రూపంలో) ముట్టజెప్పాలని, లేదా తీవ్ర పరిణామాలు ఉంటాయని జైష్ మహమ్మద్-హింద్ అనే సంస్థ ఈ బెదిరింపు లేఖలను ఆ వాహనం లో ఉంచినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈ బెదిరింపులను ఆ సంస్థ వెనక్కి తీసుకున్నదని, అంటే అంబానీ కుటుంబానికి ఎలాంటి హానీ ఉండదని ఆ సంస్థ పేర్కొన్నట్టు కూడా తెలియవచ్చింది. ఈ వాహనంలో కొన్ని నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నట్టు సమాచారం.

ఈ మిస్టరీ కేసు దర్యాప్తు బాధ్యతను నిన్న జాతీయ దర్యాప్తు  సంస్థ (ఎన్ఐఏ ) చేపట్టడంపై మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే సందేహాలు వ్యక్తం చేశారు. ఇదేదో అనుమానాస్పదంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంటీ టెర్రరిస్ట్ విభాగం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభించగా..హోం శాఖ ఆదేశాలపై మళ్ళీ కొత్తగా ఎన్ఐఎ ఇన్వెస్టిగేట్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

Kia Motors Job Mela : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. కియా మోటార్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Manish Pandey: భారీ సిక్సర్లతో అదరగొట్టిన మనీష్ పాండే.. ఫుల్ జోష్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్..

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu