అమిత్‌ బాయ్‌ ..ఐరన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాః అంబానీ ప్రశంసలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ముఖేష్‌ అంబానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్రశంసల వర్షం కురిపించారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ (పీడీపీయు) 7వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అమిత్‌ షా, అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముకేష్‌ మాట్లాడుతూ..”అమిత్‌ భాయ్‌..మీరు నిజమైన కర్మయోగి, మన దేశంలో నిజమైన ఉక్కు మనిషి మీరు’ అంటూ షాను ప్రశంసించారు. అప్పుడు గుజరాత్‌, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్సిస్తోందని అన్నారు. ప్రస్తుతం భారతదేశ భవిష్యత్తు సురక్షిత హస్తాలలో ఉందని […]

అమిత్‌ బాయ్‌ ..ఐరన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాః అంబానీ ప్రశంసలు
Follow us

|

Updated on: Aug 30, 2019 | 6:35 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ముఖేష్‌ అంబానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్రశంసల వర్షం కురిపించారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ (పీడీపీయు) 7వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అమిత్‌ షా, అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముకేష్‌ మాట్లాడుతూ..”అమిత్‌ భాయ్‌..మీరు నిజమైన కర్మయోగి, మన దేశంలో నిజమైన ఉక్కు మనిషి మీరు’ అంటూ షాను ప్రశంసించారు. అప్పుడు గుజరాత్‌, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్సిస్తోందని అన్నారు. ప్రస్తుతం భారతదేశ భవిష్యత్తు సురక్షిత హస్తాలలో ఉందని ముఖేష్‌ అంబానీ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల సమర్థనీయమైనదే’ అని అన్నారు.