జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో కశ్మీర్‌లోని పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కశ్మీరీ యువతకు 50,000 జాబ్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా కేంద్రం ఇప్పుడు మావోలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయంగా, సామాజికంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 2014-18 మధ్య కాశ్మీర్‌లో 1315 మంది చనిపోతే.. మావో ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంఖ్య ఏకంగా 2056 చేరింది.
మరోవైపు కేంద్రం మావోల ఏరివేత పేరుతో అడవులపై తమకు ఉన్న హక్కులను లాక్కునే ప్రమాదం ఉందని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు పాకిస్థాన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయానికి విభేదిస్తూ.. ఇప్పటికే అన్ని వైపుల నుంచి మార్గాలను మూసివేసిన సంగతి తెలిసిందే.