‘విస్తారా’ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. చిరంజీవి సురక్షితం!

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిలైన్స్ విమానం సాంకేతిక లోపం రావడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కి తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే […]

'విస్తారా' ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. చిరంజీవి సురక్షితం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 7:43 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిలైన్స్ విమానం సాంకేతిక లోపం రావడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కి తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నారు.

విమానంలో సాంకేతిక కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో సమాచారం బయటకు వచ్చింది.

Mega Star Chiranjeevi Among the Inconvenienced Passengers After Hyderabad-Bound Air Vistara Flight Suffers Technical Issues