Mughal Gardens: మొఘల్ గార్డెన్ కాదు ఇక నుంచి అమృత్ ఉద్యాన్.. ఈ నెల 31 నుంచి సందర్శనానికి అనుమతి..
ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా మొఘల్ గార్డెన్ పేరు మారింది. ఎల్లుండి నుంచి రెండు నెలల పాటు సందర్శనకు ఉంచింది కేంద్రం.

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్‌కు అనుగుణంగా మొఘల్ గార్డెన్ పేరును మార్చుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్‌ను ప్రారంభిస్తారు. మరోవైపు.. ఎల్లుండి నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల సందర్శన కోసం 2 నెలల పాటు ప్రవేశం కల్పించనుంది. సాధారణంగా ప్రజల సందర్శన కోసం గార్డెన్ నెల పాటు తెరుస్తారు.కానీ ఈసారి ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మరో నెల పెంచారు. అప్పటి వరకు గార్డెన్‌లోని పూలు వికసించే ఉంటాయట. అందుకే మరో నెల పొడగించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి.
రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో మొఘల్ గార్డెన్ ఉంది. దీన్ని మొఘల్ చక్రవర్తులు నిర్మించారు. ఇవి పెర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. ఈ రకం తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టినవి. సాధారణంగా ఈ గార్డెన్స్ లో సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కూడా ఉండటం విశేషం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. లాహోర్‌లో షాలిమర్ గార్డెన్స్, ఢాకాలో లాల్ బాగ్ కోట, శ్రీనగర్ లో షాలిమర్ గార్డెన్స్ మొఘల్ గార్డెన్స్ తరహాలో ఉన్నాయి. తాజ్ మహల్ వద్ద కూడా మొఘల్ గార్డెన్ ఉంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




