Olectra Greentech: లాభాల బాటలో పయనిస్తున్న ఈవీ బస్సుల సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌.. రానున్న రోజుల్లోనూ ఇదే వృద్ధిని కొనసాగిస్తామని ధీమా

2015 నుంచి దేశంలో ఈవీ బస్సుల విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ అనతికాలంలోనే అన్ని ప్రధాననగరాలకూ ఈవీ బస్సులను అందించింది. గతేడాది నాగ్‌పూర్‌, సిల్వస్సా, సూరత్, డెహ్రాడూన్‌లకు అనుకున్న స్థాయిలో బస్సులను సరఫరా చేసింది.

Olectra Greentech: లాభాల బాటలో పయనిస్తున్న ఈవీ బస్సుల సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌.. రానున్న రోజుల్లోనూ ఇదే వృద్ధిని కొనసాగిస్తామని ధీమా
Olectra Greentech
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2023 | 10:33 AM

ఈవీ బస్సుల విప్లవాన్ని తీసుకొచ్చిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మూడో త్రైమాసికం లాభాల్లో అదరగొట్టింది ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌. MEIL గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ సంస్థ ఏకంగా 141శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. గతేడాది డిసెంబర్ నాటికి అంటే 9 నెలల్లో 422 e-బస్సులను డెలివరి చేసింది ఒలెక్ట్రా. 2015 నుంచి దేశంలో ఈవీ బస్సుల విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ అనతికాలంలోనే అన్ని ప్రధాననగరాలకూ ఈవీ బస్సులను అందించింది. గతేడాది నాగ్‌పూర్‌, సిల్వస్సా, సూరత్, డెహ్రాడూన్‌లకు అనుకున్న స్థాయిలో బస్సులను సరఫరా చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం Q3లో కంపెనీకి దక్కిన బస్‌ ఆర్డర్ల విలువ 3 వేల 220 కోట్ల రూపాయలు. రాబోయే త్రైమాసికంలోనూ అంతకంత లాభాలను అంచనావేస్తున్నట్లు చెప్పారు ఒలెక్ట్రా చైర్మన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ KV ప్రదీప్.

డిసెంబర్‌-22తో ముగిసిన ప్రస్తుత తొమ్మిది నెలల కాలంలో ఒలెక్ట్రా ఆదాయం 766 కోట్లు రూపాయలు. 2021 డిసెంబర్‌ త్రైమాసికంలో 103 బస్సులను పంపిణీ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. అప్పడు సంస్థకు 18 కోట్ల 20 లక్షల రూపాయల నికర లాభాలు ఆర్జించగా.. 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడు త్రైమాసికాల్లో 42 కోట్ల రూపాయల లాభాన్ని సాధించినట్లు కంపెనీ తెలిపింది. కొన్ని త్రైమాసికాలుగా ప్రపంచవ్యాప్తంగా ev మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నా ఒలెక్ట్రా స్థిరమైన రాబడితో పాటు మార్జిన్‌ వృద్ధి సాధించింది. బలమైన వ్యాపార పనితీరు ప్రదర్శించడం వల్లే ఇది సాధ్యమైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే వృద్ధిని కొనసాగిస్తామనే కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..