Farmers Protest: మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు.. గిట్టుబాటు ధర కోసం భారీ ఆందోళన..
MSP for sunflower seeds: కనీస మద్దతు ధర కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) పంటతో పాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని హర్యానాలో భారీ ఆందోళన చేపట్టారు.

MSP for sunflower seeds: కనీస మద్దతు ధర కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) పంటతో పాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని హర్యానాలో భారీ ఆందోళన చేపట్టారు. కురుక్షేత్ర -చండీఘడ్ హైవేను రైతులు దిగ్భంధించారు. రైతులకు రెజ్లర్లు కూడా మద్దతు ప్రకటించారు. గత నెలరోజులుగా హర్యానాలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ వైపు ర్యాలీ చేపట్టారు రైతులు.. హైవేపై రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టి ఆందోళన చేపట్టారు రైతులు. ఫ్లైఓవర్లను కూడా రైతులు దిగ్భంధించడంతో ట్రాఫిక్ స్తంభించింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతు నేతలు పిప్లీ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే మహా పంచాయత్‌కు చేరుకున్నారు. ”మద్దతు ధర కల్పించండి.. రైతులను రక్షించండి” (MSP Dilao, Kisan Bachao) అనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Farmers Protest
తికాయత్‌తో సహా కీలక రైతు నేతలు హాజరు..
హర్యానా రైతుల ఆందోళనకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్‌తో సహా కీలక రైతు నేతలు హాజరయ్యారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ (డబ్ల్యుఎఫ్‌ఐ) బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా రైతులకు మద్దతుగా మహాపంచాయత్‌లో పాల్గొన్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో .. పోలీసులు ట్రాఫిక్ ను ఢిలీ – చండీగఢ్ మార్గానికి మళ్లించారు.




#WATCH | Haryana: Farmers with their tractors on roads of Kurukshetra as they gather here to hold Mahapanchyat over their demand for Minimum Support Price for sunflower seed. pic.twitter.com/5HOSvDEKww
— ANI (@ANI) June 12, 2023
హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ పొద్దుతిరుగుడు పంట కోసం 8,528 మంది రైతులకు తాత్కాలిక సాయం కింద రూ. 29.13 కోట్లను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో సన్‌ఫ్లవర్ పంటను కూడా బిబివై పథకం కింద చేర్చినట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎంఎస్‌పి కంటే తక్కువ ధరకు విక్రయించిన రైతులక నిర్ణీత పరిహారం కింద కొంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎంఎస్‌పి కింద క్వింటాల్‌కు రూ. 6,400 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




