Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP RRR Family: హస్తిన బాటలో ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు.. లోక్‌సభ స్పీకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌‌తో భేటీ

ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. ఎంపీ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని లోక్‌సభ స్పీకర్‌, రక్షణశాఖ మంత్రితో భేటీ అయ్యారు.

MP RRR Family: హస్తిన బాటలో ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు.. లోక్‌సభ స్పీకర్‌,  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌‌తో భేటీ
MP Raghu Ramakrishna Raju
Follow us
Balaraju Goud

|

Updated on: May 20, 2021 | 3:24 PM

MP Raghurama family meets Speaker: ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. ఎంపీ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని స్పీకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాఘురామపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, ఏపీ సీఐడీ చర్యలను, కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారంటూ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ రఘురామ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. రఘురామపై రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. సీఐడీ కస్టడీలో ఉన్న ఆయనను చిత్రహింసలకు గురిచేయడం వీటన్నింటిపై రఘురామ కుటుంబసభ్యులు రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన రఘురామ కుటుంబసభ్యులు.. నేడు ఓం బిర్లా, రాజ్‌నాథ్‌లతో భేటీ అయ్యారు.

Read Also….  AP Budget 2021 Live: సంక్షేమానికే పెద్ద పీట వేసిన ఏపీ ప్రభుత్వం.. 2021-22 వార్షిక బడ్జెట్‌ హైలైట్స్ ఇవే..