Asaduddin Owaisi: బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించారు.. గాడ్సేపై సినిమాను కూడా అడ్డుకుంటారా.. బీజేపీకి ఓవైసీ సవాల్..
భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ.. దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ డాక్యుమెంటరీని కేంద్రం అడ్డుకోవడంపై ఒవైసీ మండిపడ్డారు. గాడ్సేపై కూడా సినిమాను...
భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ.. దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ డాక్యుమెంటరీని కేంద్రం అడ్డుకోవడంపై ఒవైసీ మండిపడ్డారు. గాడ్సేపై కూడా సినిమాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సంచలనం సృష్టిస్తోంది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బీబీసి డాక్యుమెంటరీని అడ్డుకోవడానికి పాలక ప్రభుత్వం తీసుకున్న చర్యపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా ప్రధాన మంత్రి అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.
బ్రిటీష్ చట్టాల ఆధారంగా భారతదేశంలో ట్విట్టర్, యూట్యూబ్‌లో బీబీసీ డాక్యుమెంటరీని మోడీ ప్రభుత్వం నిషేధించింది. గుజరాత్ అల్లర్లలో అంతరిక్షం నుంచి లేదా ఆకాశం నుంచి వచ్చిన వాళ్లు ప్రజలను చంపారా. గాంధీని హత్య చేసిన గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటి. ప్రధానిని, బీజేపీ నేతలను ఇదే మాట అడుగుతున్నాను. ఇప్పుడు గాడ్సేపై ఓ సినిమా తెరకెక్కుతోంది. గాడ్సేపై తీస్తున్న సినిమాను పీఎం బ్యాన్ చేస్తారా? గాడ్సే సినిమాపై నిషేధం విధించాలని బీజేపీకి సవాల్ విసురుతున్నాను.
– అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ
కాగా.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. “ఇండియా: ది మోడీ క్వశ్చన్” ఎపిసోడ్ ను షేర్ చేస్తున్న యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ వీడియోలతో పాటు, లింక్‌లను కలిగి ఉన్న 50 కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్రం ట్విట్టర్‌ను ఆదేశించింది. ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి సమాచార, ప్రసార కార్యదర్శి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..