AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indians: దేశ చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయం గురించి ఎంత మందికి తెలుసు.. సర్వేలో వెల్లడైన షాకింగ్ విషయాలు

Indians: భారతీయులు చాలా తెలివి తేటలు, కష్టపడే తత్వం కలవారు.. అందుకనే ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ చూసినా ఏదొక మూల భారతీయులు కనిపిస్తూనే ఉంటారు..

Indians: దేశ చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయం గురించి ఎంత మందికి తెలుసు.. సర్వేలో వెల్లడైన షాకింగ్ విషయాలు
India Country
Surya Kala
|

Updated on: May 01, 2022 | 6:57 AM

Share

Indians: భారతీయులు చాలా తెలివి తేటలు, కష్టపడే తత్వం కలవారు.. అందుకనే ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ చూసినా ఏదొక మూల భారతీయులు కనిపిస్తూనే ఉంటారు. ఇది అందరికీ తెలిసిన సంగతే.. అయితే చాలామంది భారతీయులకు తమ సొంత దేశ చరిత్ర (History),  సంస్కృతి (Culture), ప్రముఖ ప్రదేశాలు (Destinations), ప్రకృతి, ఆహారం గురించి ఇంకా చాలా విషయాలు గురించి పెద్దగా తెలియదు. ఈ విషయం మహీంద్రా హాలిడేస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆసియా సింహాలకు ఏకైక ఆవాసం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యం.. ఖజురహో నృత్యోత్సవాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతాయని.. వంటి అనేక విషయాలు దేశంలో దాదాపు 60 శాతం మందికి తెలియదని సర్వేలో వెల్లడైంది. ఇక మన దేశంలో సాంప్రదాయ వంటకాల గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలుసు.. తమ దేశంలోని కళలు, సంస్కృతి, వారసత్వంపై కూడా ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమేనని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను టెలిఫోన్, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా మహీంద్రా హాలిడేస్‌ నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, చండీగఢ్‌ తదితర 16 నగరాల నుంచి 4,039 మంది ఇందులో పాల్గొన్నారు.

సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా (55 శాతం) మందికి ఐపాన్ ఉత్తరాఖండ్‌లోని ప్రధాన జానపద కళారూపం అని తెలియదు. అంతేకాదు మూడవ (39 శాతం) మందికి మధ్యప్రదేశ్‌లో ఖజురహో పండుగను జరుపుకుంటారనే విషయం తెలియదు.

మహీంద్రా హాలిడేస్, సర్వేలో పాల్గొన్న దాదాపు మూడో వంతు (32 శాతం) మందికి పైఠనీ చీరలకు కొనుగోలుకు మహారాష్ట్ర ఉత్తమమైన ప్రదేశం అని తెలియదని పేర్కొంది.

నిజానికి భారతదేశానికి కాఫీని పరిచయం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా కూర్గ్‌లో పండించిన సంగతి తెలిసిన వారి సంఖ్య మూడో వంతు కన్నా (31 శాతం) తక్కువే’’ అని సర్వే పేర్కొంది.

భారతదేశంలోని గిర్‌ అభయారణ్యంలో మాత్రమే ఆసియా సింహాలు కనిపిస్తాయన్న విషయం  దాదాపు 39 శాతం మందికి తెలియదు.

ఉదయ్‌పూర్‌ సరస్సుల నగరంగా ప్రసిద్ధి అని.. రాజస్థాన్ లోని కుంభల్‌గఢ్‌ కోట..  చైనా వాల్‌ తర్వాత అత్యంత పొడవైన గోడని మూడోవంతు మందికి తెలియదు.

Also Read: Tirumala: శ్రీవారి దర్శనానికి ఒక్కరే వెళ్తున్నారా.. అక్కడ ఉండడానికి గల సౌకర్యాలు మీకోసం

AP Crime News: అంతా మాయ..! సత్తుపల్లి టు సత్తెనపల్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం..