Hanuman Chalisa Row హనుమాన్ చాలీసా ఆందోళనలపై ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మత హింస, చర్చలు జరుగుతున్నాయి. పండుగల సందర్భంగా రాళ్లదాడి చేసినా, లౌడ్‌స్పీకర్లు, హనుమాన్ చాలీసాపై వివాదాలు.. ఇలా అన్నింటిపైనా రాజకీయ రచ్చ జరుగుతోంది.
Sharad Pawar on Hanuman Chalisa Row: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మత హింస, చర్చలు జరుగుతున్నాయి. పండుగల సందర్భంగా రాళ్లదాడి చేసినా, లౌడ్‌స్పీకర్లు, హనుమాన్ చాలీసాపై వివాదాలు.. ఇలా అన్నింటిపైనా రాజకీయ రచ్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. దేశంలో ముఖ్యమైన అంశాలు మినహా కులం, మతం వంటి అంశాలపై చర్చ జరుగుతోందని, దీని వల్ల దేశం వెనుకబాటుకు గురవుతోందన్నారు. మతం, కులం పేరుతో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లే పనిని గత కొద్ది రోజులుగా చూస్తున్నామని సీనియర్ నేత శరద్ పవార్ అన్నారు. అయితే అసలు ప్రజల సమస్యలు ఏమిటి? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, నిరుద్యోగం గురించి మాట్లాడాలి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్‌సిపి చీఫ్ పవార్ ఇదే విషయంపై మాట్లాడుతూ, రోజు టివి తెరిచి చూస్తుంటే, ఎవరో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడని ఎవరో అంటున్నారని, మరొకరు హనుమాన్ చాలీసా చదవాలనుకుంటున్నారని అన్నారు. ఈ ప్రశ్నలన్నీ ప్రాథమిక సమస్యలకు పరిష్కారమా? వీటన్నింటితో పోరాడాలంటే మనం సాహు మహరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని అనుసరించాలని శరద్ పవార్ పిలుపునిచ్చారు.
ఇంతకుముందు కూడా శరద్ పవార్ విద్వేషాన్ని వ్యాప్తి చేయడం గురించి ప్రస్తావించగా.. అంతకుముందు, ఢిల్లీ మాదిరిగానే మహారాష్ట్రలో కూడా మత ఉద్రిక్తతలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలను, సమాజాన్ని రెచ్చగొట్టేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముంబైలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే పని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లిం సమాజం సోదరభావాన్ని కొనసాగించాలని శరద్ పవార్ అన్నారు.
Read Also…. Punjab: జూన్ 20 వరకు వరి నాట్లు వాయిదా వేయాలని ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ.. కారణం అదేనా?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి