Budget 2022 Updates: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుంది? ఆర్థిక శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో పార్లమెంటులో 2022-23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

Budget 2022 Updates: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుంది? ఆర్థిక శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యలు
Finance Minister Nirmala Sitaraman (Photo: ANI)
Follow us
Janardhan Veluru

|

Updated on: Feb 01, 2022 | 10:15 AM

Nirmala Sitaraman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో పార్లమెంటులో 2022-23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ నాలుగోసారి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ఇదే అంశంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమగ్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రతి రంగానికి సంబంధించిన అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. రైతులు సహా అన్ని రంగాల వారికి, ప్రతి ఒక్కరికీ సంతృప్తి కలిగించేలా బడ్జెట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.

బడ్జెట్ రూపకల్పనలో నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరీ, భగవత్ కె.కరాడ్ తమవంతు సాయాన్ని అందించారు. బడ్జెట్ డే నేపథ్యంలో తన నివాసంలో సహాయ మంత్రి భగవత్ కరాడ్ తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ సమర్పణకు అధికార, విపక్ష సభ్యులు సహకరించాలని భగవత్ కరాడ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇది వరకే అందరికీ విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ మదుపర్లలో సానుకూలత నెలకొంటోంది. దీంతో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

కరోనా కారణంగా ఈసారి కూడా నిర్మలా సీతారామన్ కాగిత రహిత బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ట్యాబ్ ద్వారా బడ్జెట్‌ను లోక్‌‌సభలో చదవి వినిపిస్తారు.

Also Read..

Bhama Kalapam: లైగర్ చేతుల మీదుగా ప్రియమణి థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ భామా కలాపం ట్రైలర్

Stock Market: స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ డే జోష్‌.. భారీ లాభాల్లో ట్రేడింగ్‌