Stock Market: స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ డే జోష్‌.. భారీ లాభాల్లో ట్రేడింగ్‌

Stock Market: బడ్జెట్‌ డేన దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. స్టాక్‌ మార్కెట్లో భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 655, నిఫ్టీ 178 పాయింట్ల..

Stock Market: స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ డే జోష్‌.. భారీ లాభాల్లో ట్రేడింగ్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2022 | 10:47 AM

Stock Market: బడ్జెట్‌ డేన దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. స్టాక్‌ మార్కెట్లో భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 655, నిఫ్టీ 178 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడింగ్‌ అవుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11గంలకు 2022-23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కరోనాతో అస్తవ్యస్తంగా మారిపోయిన ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చని మదుపర్లు భావిస్తున్నారు. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్‌లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Budget 2022 LIVE: నేడు పార్లమెంట్‌ కేంద్ర బడ్జెట్‌.. ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది?

Budget 2022: దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల ఆశలన్నీ కూడా బడ్జెట్‌పైనే.. మరి నిర్మలమ్మ కరుణించేనా.?