Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata: రతన్‌ టాటా రహస్య స్నేహితుడు ఎవరు…? ఆయన కోసం సెపరేట్‌గా వీలునామాలో..

దేశవ్యాప్తంగా ఇప్పుడో పేరు మార్మోగుతోంది. ఎవరీ వ్యక్తి అని గూగుల్ తల్లిని అడిగినా సరిగ్గా వివరాలు చెప్పడం లేదు. రతనా టాటా వీలునామాలో ఉన్న ఈపేరు..అటు టాటా ఫ్యామిలీకి కూడా అంతుచిక్కడంలేదు. వ్యాపార దిగ్గజం వీలునామా ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. ఇంతకూ దివంగత రతన్‌ టాటా రహస్య స్నేహితుడు ఎవరు...? ఆయన కోసం సెపరేట్‌గా వీలునామాలో రతన్‌ టాటా ఏం రాశారు...? అసలా అజ్ఞాత వ్యక్తికి రతన్ టాటాకు ఉన్న సంబంధం ఏమిటి?

Ratan Tata:  రతన్‌ టాటా రహస్య స్నేహితుడు ఎవరు...? ఆయన కోసం సెపరేట్‌గా వీలునామాలో..
Ratan Tata
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 07, 2025 | 8:23 PM

దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా..వీలునామా సంచలనాలకు కేరాఫ్‌గా మారింది. వీలునామా ఓపెన్ చేస్తే..ఓపేరు టాటా కుటుంబ సభ్యులనే కాదు.యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రతన్‌ టాటా మిగిలిన ఆస్తుల్లో మూడింట ఒక వంతు ట్రావెల్‌ సెక్టార్‌లోని ఎంటర్ ప్రెన్యూర్ మోహనిమోహన్ దత్తాకు చెందాలని వీలునామాలో రాసుంది. ఇప్పుడీ అంశంపైనే దేశవ్యాప్తంగా డీప్ డిస్కషన్ జరుగుతోంది.

రతన్ టాటా వీలునామా ప్రకారం రెసిడ్యువల్ అసెట్స్..అంటే వీలునామా ప్రకారం ఆస్తులన్నీ వారసులకు పంచిన తర్వాత, ఫైనల్ ఎక్స్‌పెన్స్‌లు చెల్లించేశాక మిగిలిన ఆస్తులు అని అర్థం. ఈ మిగిలిన ఆస్తుల విలువ దాదాపు 500కోట్లు ఉంటుందని అంచనా. ఈమొత్తం ఆస్తులు మోహినీ మోహన్‌ దత్తాకు ఇవ్వాలన్నది రతనా టాటా వీలునామా సారాంశం. ఇప్పుడీ మోహనీ మోహన్ దత్తా ఎవరన్నదానిపై పెద్ద చర్చ జరుగుతోంది. రతన్ టాటాతో మోహినీ మోహన్ దత్తాకు ఉన్న అనుబంధం పెద్దగా తెలియదు. అయితే అతడు చాలా సంవత్సరాలుగా టాటాకు నమ్మకమైన అసోసియేట్‌గా ఉన్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అతని కుటుంబానికి గతంలో 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనమైన స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఈ విలీనానికి ముందు దత్తా, అతని కుటుంబం స్టాలియన్‌లో 80% వాటా కలిగి ఉంది. టాటా ఇండస్ట్రీస్ మిగిలిన 20 శాతం వాటాను హోల్డ్‌ చేస్తుండేది. దత్తా గతంలో థామస్ కుక్‌కి అనుబంధంగా ఉన్న TC ట్రావెల్ సర్వీసెస్‌లో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

మోహని మోహన్ 2024 అక్టోబర్ లో జరిగిన టాటా అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఆయితే ఆసమయంలో ఎవరికీ పెద్దగా దత్తా తెలియదు. అయితే అదే సందర్భంలో ఇచ్చిన ఓ ఇంటర్య్లూలో రతన్ టాటతో 60 సంవత్సరాల స్నేహం ఉందని..,వెల్లడించారు. తాను రతన్ టాటాను మొదటిసారి 24 సంవత్సరాల వయసులో కలిశామని.,…తన అభివృద్ధికి రతన్ చాలా సహాయపడ్డారని తెలిపారు. మోహిని మోహన్ వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. రతన్ టాటా వీలునామా ప్రకారం, రతన్ టాటా ఎస్టేట్‌లో మూడింట ఒక వంతు మోహిని మోహన్‌కు ఇవ్వాలి. మూడో వంతు అంటే 500 కోట్లు ఉంటుందని అంచనా. మిగిలిన రెండు భాగాలు రతన్ టాటా ఇద్దరు సోదరీమణులకు వెళ్తాయి. ఆ వీలునామాలో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా, అతని పిల్లల పేర్లు లేవని తెలుస్తోంది. అయితే హైకోర్టు ధ్రువీకరించిన తర్వాతే వీలునామా ను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రక్రియకు కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

రతన్ టాటా మరణానికి ముందు రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్, రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. రతన్ టాటాకు టాటా సన్స్ లో నేరుగా 0.83 శాతం వాటా ఉంది. ఇది సుమారు రూ .8,000 కోట్లు ఉంటుంది. వివిధ స్టార్టప్ లలో వాటాలు, ఆర్ ఎన్ టీ అసోసియేట్స్ లో రూ.186 కోట్ల పెట్టుబడులు, పెయింటింగ్స్ తో సహా ఖరీదైన ఆర్ట్ వర్క్ తో పాటు లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ వద్ద వాల్యుయేషన్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే రతన్ టాటా మొత్తం నికర విలువ ఇంకా అస్పష్టంగా ఉందని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..