AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Cabinet: ప్రధాని మోదీ నివాసానికి చేరుకుంటున్న నేతలు.. కిషన్ రెడ్డికి ప్రమోషన్.. రమేష్ పోఖ్రియాల్‌ ఔట్..!

కేంద్ర కేబినెట్ విస్తరణ గంట గంటకు ఉత్కంఠ రేపుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురికి బెర్త్‌లు ఖరారైనట్టు క్లారిటీ వచ్చింది.

Modi Cabinet: ప్రధాని మోదీ నివాసానికి చేరుకుంటున్న నేతలు.. కిషన్ రెడ్డికి ప్రమోషన్.. రమేష్ పోఖ్రియాల్‌ ఔట్..!
Kisanreddy
Balaraju Goud
|

Updated on: Jul 07, 2021 | 1:56 PM

Share

Union Cabinet Expansion: కేంద్ర కేబినెట్ విస్తరణ గంట గంటకు ఉత్కంఠ రేపుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురికి బెర్త్‌లు ఖరారైనట్టు క్లారిటీ వచ్చింది. ఇందులో ఓబీసీలు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. వారిలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో గంగాపురం కిషన్‌ రెడ్డి జాక్‌పట్‌ కొట్టబోతున్నారా? డబల్‌ ప్రమోషన్‌ కొట్టేస్తున్నారా? తెలుగు రాష్ట్రాలకు ఇది అదనమా? అంటే ఔవుననే సంకేతాలు వస్తున్నాయి ఢిల్లీ నుంచి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ సిగ్నల్స్‌ వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంత్రిమండలి విస్తరణలో భాగంగా కేబినెట్‌ మంత్రిగా ఛాన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్లు సమాచారం. ఇది కాని పక్షంలో స్వతంత్ర హోదా కలిగిన మంత్రిగా పదోన్నతి దక్కేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందులోనే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే కొత్తగా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్‌ కో ఆపరేషన్‌ శాఖను ఏర్పాటు చేసింది. దీని బాధ్యతలను మంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే కిషన్ రెడ్డికి స్వతంత్ర హోదాలో కార్మికశాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది.

ముఖ్యంగా రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకే మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులుపై క్లారిటీ రావడంతో నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. అధికారికంగా పిలుపు రావడంతో పార్లమెంట్ సభ్యులు ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారు. ఎంపీ మినాక్షి లేఖి, పురుషోతం రూపాల, అనురాగ్‌ ఠాకూర్‌లు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను.. మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్టు ఢిల్లీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియ పటెల్‌కు బెర్త్‌ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొత్తగా తీసుకునే మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కి సమాచారం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.

ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందికి ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్‌ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్‌ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం.

Read Also… Priests Curse: పూజారుల శాపంతో ఇద్దరు ముఖ్యమంత్రులు మారారట.. గంగోత్రి మందిర్ సమితి వింత వాదన