Priests Curse: పూజారుల శాపంతో ఇద్దరు ముఖ్యమంత్రులు మారారట.. గంగోత్రి మందిర్ సమితి వింత వాదన
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి పూజారుల శాపం తగిలిందా.. తమ మాట విననందుకే సీఎం పదవి నుంచి తీరత్ సింగ్ రావత్ పదవీచ్యుతుడయ్యాడా?.. అదే నిజం అంటున్నారు గంగోత్రి మందిర్ సమితి సభ్యులు.
BJP forced to change Uttarakhand CM twice: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి పూజారుల శాపం తగిలిందా.. తమ మాట విననందుకే సీఎం పదవి నుంచి తీరత్ సింగ్ రావత్ పదవీచ్యుతుడయ్యాడా?.. అదే నిజం అంటున్నారు గంగోత్రి మందిర్ సమితి సభ్యులు. దేవస్థానం బోర్డును రద్దు చేయడంలో విఫలమైనందున ఉత్తరాఖండ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని పొగొట్టుకున్నారని గంగోత్రి మందిర్ సమితి తెలిపింది. ఆలయ బోర్డును రద్దు చేయకపోతే వచ్చే ఏడాది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని ఆలయ సంస్థ సంయుక్త కార్యదర్శి రాజేష్ సెమ్వాల్ అన్నారు.
మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయ బోర్డు ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రత్యేక దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసి.. ఉత్తరాఖండ్‌లోని 51 దేవాలయాల వ్యవహారాలను నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల పూజారులు అనేక వారాలపాటు రిలే ఉపవాసదీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేవాలయ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది వారి హక్కులను హరించడమే అంటూ నిరసన తెలిపారు.
“పూజారుల శాపం కారణంగా బీజేపీకి మూడున్నర సంవత్సరాలలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారాల్సి వచ్చింది. పార్టీ అనుభవం నుండి నేర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుంది. కొత్త ముఖ్యమంత్రి త్వరలోనే దేవస్థానం బోర్డును రద్దు చేయకపోతే 2022 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూజారులు అనుమతించరు “అని సెమ్వాల్ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, కుంభమేళా సందర్భంగా దేవాలయాలను ప్రత్యేక బోర్డు పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీల నుంచి నియంత్రణ నుండి తొలగిస్తామని ప్రకటించారు. అయితే తన మాటను నిలబెట్టుకోకముందే రావత్ గత వారం పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అతని స్థానంలో పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Read Also… జేడీయులో కేంద్ర కేబినెట్ విస్తరణ చిచ్చు.. సీఎం నితీష్, జేడీయు నేత భిన్నస్వరాలు…