AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాషాయ పార్టీకి అధికారమే పరమావధి.. ‘మహా’ ఎపిసోడ్ చూస్తే చాలు.!

అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ. శరద్ పవార్.. ఇలా ఒకరేమిటి.. రాజకీయాల్లో ఆరితేరిన మహామహులు ఎందరో ఉన్నారు. అయితే వీరందరిలోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రాజకీయ మేధావులు.. ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయితే… మరొకరు బీజేపీని నడిపిస్తున్న అమిత్ షాలు. రాజకీయ శత్రువును కోలుకోలేనంతగా దెబ్బ తీయడంలో.. మోదీ-షాలు సిద్దహస్తులు. దీనికి సరైన ఉదాహరణ మహారాష్ట్ర తాజా రాజకీయాలు.. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేదని గవర్నర్‌కు మొదటిగా లేఖ రాసిన కమలం […]

కాషాయ పార్టీకి అధికారమే పరమావధి.. 'మహా' ఎపిసోడ్ చూస్తే చాలు.!
Ravi Kiran
|

Updated on: Nov 25, 2019 | 4:24 PM

Share

అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ. శరద్ పవార్.. ఇలా ఒకరేమిటి.. రాజకీయాల్లో ఆరితేరిన మహామహులు ఎందరో ఉన్నారు. అయితే వీరందరిలోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రాజకీయ మేధావులు.. ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయితే… మరొకరు బీజేపీని నడిపిస్తున్న అమిత్ షాలు. రాజకీయ శత్రువును కోలుకోలేనంతగా దెబ్బ తీయడంలో.. మోదీ-షాలు సిద్దహస్తులు. దీనికి సరైన ఉదాహరణ మహారాష్ట్ర తాజా రాజకీయాలు..

తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేదని గవర్నర్‌కు మొదటిగా లేఖ రాసిన కమలం పెద్దలు.. సరిగ్గా రెండు వారాల తిరిగేసరి మెజార్టీ సాధించి.. ప్రమాణస్వీకారాలు కూడా చేసేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. చేతుల్లో పవర్ ఉంటే చాలు.. ఏదైనా చేసేయొచ్చు అనడానికి మరోసారి ఈ సమీకరణాలు రుజువు చేశాయి.

ఇదొక్కటే కాదు.. గతంలో ఆర్టికల్ 370, కర్ణాటక రాజకీయాలు, ఏపీ స్టేటస్ వంటి మొదలైన అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. వీటన్నింటిలో కూడా మోదీ,షాలు రచించిన వ్యహాత్మక ప్రణాళికలు.. వారిద్దరిని అపర చాణక్యులుగా నిరూపిస్తాయి. అయితే ‘మహా’ రాజకీయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎత్తుల కంటే.. బీజేపీ అధికారం దక్కించుకోవడం కోసమే శతవిధాల ప్రయత్నించిందని చెప్పొచ్చు.

ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత బలం లేదని చెప్పిన బీజేపీ.. సడన్‌గా రాత్రికి రాత్రి మంతనాలు జరపడమే కాకుండా.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలను కూడా ఎన్నుకుని.. గుట్టు చప్పుడు కాకుండా ప్రొద్దున్నే ప్రమాణాలను కూడా కానిచ్చేసింది. అటు ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం.. ఇవన్నీ కమలనాథుల ‘స్క్రిప్ట్‌డ్ రాజకీయాల’ని ప్రజలకు ఈజీగానే అర్ధమవుతున్నాయి. మరి ఈ ‘మహా’ రాజకీయాల చాప్టర్ అంతా చూసిన తర్వాత ఇది మోదీ,షాల వ్యూహం అనాలా..? లేక చాణక్యం అనాలా.? అనేది మీరే చెప్పాలి.