బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నుతూ..

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.   బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ అభ్యర్థిపై దాడి చేసి వీరంగం సృష్టించారు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు. జియాఘాట్‌ ఇస్లాంపూర్‌ ప్రైమరీ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ను పరిశీలించేందుకు వచ్చిన కరీంపూర్‌ బీజేపీ అభ్యర్థి జైప్రకాష్‌ మజుందార్‌పై దాడికి తెగబడ్డారు తృణమూల్ కాంగ్రెస్‌కార్యకర్తలు.  జైప్రకాష్‌ను కాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లి మురికి కాలువలో పడేశారు. ఈ వీడియో స్థానిక సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాడిపై […]

బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నుతూ..
Pardhasaradhi Peri

|

Nov 25, 2019 | 9:20 PM

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.   బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ అభ్యర్థిపై దాడి చేసి వీరంగం సృష్టించారు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు. జియాఘాట్‌ ఇస్లాంపూర్‌ ప్రైమరీ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ను పరిశీలించేందుకు వచ్చిన కరీంపూర్‌ బీజేపీ అభ్యర్థి జైప్రకాష్‌ మజుందార్‌పై దాడికి తెగబడ్డారు తృణమూల్ కాంగ్రెస్‌కార్యకర్తలు.  జైప్రకాష్‌ను కాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లి మురికి కాలువలో పడేశారు. ఈ వీడియో స్థానిక సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దాడిపై స్పందించిన జై ప్రకాష్‌ మజుందార్‌..తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు రిగ్గింగ‌కు ప్రయత్నించారని ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నించిన తన పట్ల వీధి రౌడీల్లాప్రవర్తించారని..వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐతే జై ప్రకాష్‌పై దాడి చేసింది తమ కార్యకర్తలు కాదని..స్థానికులే బీజేపీపై ఆగ్రహంతో దాడి చేశారని అంటోంది

తృణమూల్‌ కాంగ్రెస్‌. కరీంపూర్‌, ఖరగ్‌పూర్‌ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నిక కావడంతో ఈ రెండు స్థానాలకు బై ఎలక్షన్ జరుగుతుండగా..కలియాగంజ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పర్మతానాథ్‌ మృతిచెందడంతో ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu