AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుకు డబుల్ షాక్..తెలంగాణ ఏసీబీ ఏం చేసిందంటే?

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ ఒకేరోజు డబుల్ షాకిచ్చింది. చంద్రబాబు అక్రమాస్తుల కేసును హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టు సోమవారం విచారించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారంటూ స్వర్గీయ ఎన్టీరామారావు సతీమణి, ప్రస్తుత ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే,, 15 ఏళ్ళ కిందట.. చంద్రబాబు.. హైకోర్టును ఆశ్రయించి తనపై […]

చంద్రబాబుకు డబుల్ షాక్..తెలంగాణ ఏసీబీ ఏం చేసిందంటే?
Rajesh Sharma
|

Updated on: Nov 25, 2019 | 7:41 PM

Share

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ ఒకేరోజు డబుల్ షాకిచ్చింది. చంద్రబాబు అక్రమాస్తుల కేసును హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టు సోమవారం విచారించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారంటూ స్వర్గీయ ఎన్టీరామారావు సతీమణి, ప్రస్తుత ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే,, 15 ఏళ్ళ కిందట.. చంద్రబాబు.. హైకోర్టును ఆశ్రయించి తనపై దాఖలైన పిటిషన్‌పై విచారణ నిలిపివేయాలంటూ స్టే తెచ్చుకున్నారు. 2005 చంద్రబాబు పిటిషన్‌ను విచారించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టే జారీ చేసింది. అయితే ఈ స్టే గడువు పది సంవత్సరాలు దాటిపోవడంతో దానిని పునరుద్దరించాలి లేదా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్టే తొలగిపోవడంతో ఏసీపీ కోర్టు విచారణను మళ్ళీ ప్రారంభించింది. చంద్రబాబుపై ఆరోపణలు చేసిన లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు 2015లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదికి వచ్చింది. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు ఆనాటి టిడిపి నేత, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 50 లక్షల ముడుపులు ఆఫర్ చేస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో చంద్రబాబు స్వయంగా స్టీఫెన్సన్ ‘‘బ్రీఫ్డ్ మీ బ్రదర్’’ అంటూ ఫోన్‌లో ఇచ్చిన హామీ కూడా తెరమీదికి వచ్చింది. అయితే.. ఆ కేసు విచారణపై చంద్రబాబు 2016లో హైకోర్టు స్టే పొందారు.

అయితే ఈ కేసు విచారణను మళ్ళీ ప్రారంభించాలని వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి 2017లో సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహా పిటిషన్‌ను ఆళ్ళ సోమవారం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. 2017లో దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్ట్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం గడప తొక్కారు. ఏసీపీ తన చార్జిషీటులో చంద్రబాబు పేరును ప్రస్తావించినందున స్టే ఎత్తివేసి చంద్రబాబుపై విచారణకు ఆదేశించాలని ఆర్కే తన పిటిషన్‌లొ కోరారు. గతంలో సుప్రీంకోర్టు ఇదే విషయంపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన అంశాన్ని ప్రస్తావించారు ఆర్కే.

ఒకే రోజు ప్రత్యక్షంగా ఒక కేసులో.. పరోక్షంగా ఇంకో కేసులో తెలంగాణ ఏసీపీ చంద్రబాబుకు షాకిచ్చినట్లయింది.

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే