Trinamool Congress: మమతా బెనర్జీకి వరుస షాక్‌లు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే

Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్‌లు..

Trinamool Congress: మమతా బెనర్జీకి వరుస షాక్‌లు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 26, 2021 | 10:42 PM

Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీలో కీలక నేతలు పలువురు ప్రభుత్వ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే ప్రబీర్ ఘోషల్ షాక్ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండా పార్టీకి చెందిన కొందరు నేతలు అడ్డుకుంటున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. రాజీనామా అంశంమై మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. పార్టీలో తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు చేయడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ కారణంగానే పార్టీ నుంచి వైదొలుగుతున్నానని ప్రబీర్ ఘోషల్ ప్రకటించారవు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతానే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తరపరా శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రబీర్ ఘోషల్.. హుగ్లీ జిల్లా కమిటీ సభ్యుడిగా, టీఎంసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

Also read:

Remote Voting: మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా సీఈసీ.. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా..

30 years of Akshay Kumar: అక్షయ్ కుమార్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. 53 ఏళ్ల వయసులోనూ అదే ఎనర్జీ