TRP scam case: టీఆర్పీ కుంభకోణంలో మరో మలుపు.. కీలక విషయాలు వెల్లడించిన బార్క్ మాజీ చీఫ్..
TRP scam case: ముంబై కేంద్రంగా జరిగిన టీవీ రేటింగ్ పాయింట్స్ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ప్రధాన..
TRP scam case: ముంబై కేంద్రంగా జరిగిన టీవీ రేటింగ్ పాయింట్స్ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ప్రధాన వ్యక్తులుగా ఉన్న బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రిసెర్య్ కౌన్సిల్(బార్క్) మాజీ చీఫ్ పార్థో దాస్‌గుప్తా సంచలన విషయాలు వెల్లడించారు. టీఆర్పీ రేటింగ్స్ మార్చేందుకు రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్ణబ్ గోస్వామి తనకు భారీ మొత్తంలో నగదు ఇచ్చారని వెల్లడించారు. రూ. 40 లక్షల క్యాష్‌తో పాటు విహార యాత్రల కోసం మరో రూ.8.75 లక్షలు ఇచ్చారని అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.
అంతేకాకుండా.. తనకు సాయం చేయాలని ఆర్ణబ్ తనను తరచూ అడిగేవారని పేర్కొన్నారు. భవిష్యత్తులో అండగా ఉంటానని ప్రామిస్ కూడా చేశారని దాస్ గుప్తా చెప్పుకొచ్చారు. ఆ పరిచయం వల్లే.. తన బృందంతో కలిసి టీఆర్పీ రేటింగ్స్‌లో మార్పులు చేసి రిపబ్లిక్ టీవీకి అగ్రస్థానం వచ్చేలా చేశామని వాంగ్మూలంలో దాస్‌గుప్తా వెల్లడించారు.
కాగా, ఈకేసుకు సంబంధించిన ముంబై పోలీసులు సప్లిమెంటరీ చార్జిషీటును కోర్టులో సమర్పించిన విషయం తెలిసిందే. 3600 పేజీల చార్జిషీటులో దాస్‌గుప్తాకు ఆర్ణబ్ గోస్వామి మధ్య జరిగిన వాట్సప్ చాట్, దాస్‌గుప్తాతో పాటు 59 మంది ఇచ్చిన వాంగ్మూలాలను పొందుపరిచారు.
Also read:
Google Duo: ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్ నిలిచిపోనుందా?.. ఆ మెసేజ్ అందుకే వస్తోందా?..
Remote Voting: మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా సీఈసీ.. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా..