AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్

గుజరాత్‌లో దారుణం జరిగింది. పన్నెండేళ్ళ దివ్యాంగ బాలికపై వరసకు సోదరుడయ్యే యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం దారుణంగా తల నరికి హత్య చేశాడు.

దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్
Rajesh Sharma
|

Updated on: Oct 18, 2020 | 2:23 PM

Share

Minor and specially able girl raped by cousin brother: గుజరాత్‌లో దారుణం జరిగింది. పన్నెండేళ్ళ దివ్యాంగ బాలికపై వరసకు సోదరుడయ్యే యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం దారుణంగా తల నరికి హత్య చేశాడు. తల లేని మొండాన్ని కనుగొన్న పోలీసులు కూపీ లాగగా… ఈ దారుణానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి.

గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లా దంతివాడ ఏరియాలో ఓ దివ్యాగురాలైన పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం, హత్యోదంతం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోతిభఖర్ గ్రామ సమీపంలో పోలీసులు తల లేని బాలిక మొండాన్ని కనుగొన్నారు. దానికి 24 గంటల ముందే దివ్యాంగురాలైన ఓ బాలిక కనిపించడం లేదని దంతివాడ పోలీసులకు ఫిర్యాదు అందింది.

బాలిక గురించి వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు మోతిభఖర్ గ్రామ శివారుల్లో ముందుగా తల లేని మొండెం కనిపించింది. దానికి మరికొద్ది దూరంలో తలను పోలీసులు కనుగొన్నారు. ఐడెంటిఫై చేసేందుకు బాలిక బంధువులను పిలిపించగా.. వారు ఆమెను తప్పిపోయిన దివ్యాంగ బాలికగా గుర్తించారు.

అనంతరం దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. సమీపంలోని పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దాంట్లో బాలికకు సోదర వరసయ్యే 25 ఏళ్ల నితిన్ మాలి ఆమెను తన బైక్‌ మీద తీసుకువెళుతూ కనిపించాడు. పోలీసులు తమదైన శైలిలో ఆ యువకుడిని విచారించారు. దాంతో నితినే ఆ బాలికపై అత్యాచారం చేసి.. తీరా విషయం అందరికీ తెలుస్తుందనే భయంతో ఆమెను దారుణంగా తలనరికి చంపేసినట్లు అంగీకరించాడని దీసా ఏరియా డీఎస్పీ డా.కుశల్ ఓజా చెబుతున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించిన పోలీసులు.. నితిన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా.. బాధితురాలి కుటుంబీకులను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజుల్‌బెన్ దేశాయ్ పరామర్శించారు. పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు