AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచితో

నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ పెసరపప్పు హల్వా ఒక్కసారి తింటే అస్సలు వదలరు. అమృతం లాంటి పెసరపప్పు హల్వా తయారీకి సులభమైన రెసిపీ ఇది. ప్రత్యేక సందర్భాలకు.. నైవేద్యంగా సమర్పించడానికి అద్భుతమైన ఈ తీపి వంటకాన్ని ఇంట్లోనే సులభంగా చేసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Nov 05, 2026 | 2:24 PM

Share

కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు – ఒక టీ గ్లాస్,  నీళ్లు – నాలుగు గ్లాసులు, నెయ్యి – అర గ్లాసు కంటే కొద్దిగా తక్కువ, 
రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు, గోధుమపిండి – ఒక టేబుల్ స్పూన్,  చక్కెర – రెండు గ్లాసులు, యాలకులు – నాలుగు (దంచి పెట్టుకోవాలి),  రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు – ఒక టీ గ్లాస్, నీళ్లు – నాలుగు గ్లాసులు, నెయ్యి – అర గ్లాసు కంటే కొద్దిగా తక్కువ, రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు, గోధుమపిండి – ఒక టేబుల్ స్పూన్, చక్కెర – రెండు గ్లాసులు, యాలకులు – నాలుగు (దంచి పెట్టుకోవాలి), రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఒక పాన్‌లో ఒక టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని, చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. పప్పు వేయించడం వల్ల హల్వాకు మంచి రుచి, కమ్మటి వాసన వస్తుంది. పప్పును మాడకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత వీటిని కుక్కర్‌లోకి తీసుకోవాలి.
 కుక్కర్‌లోకి తీసుకున్న పెసరపప్పును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. మూడు గ్లాసుల నీళ్లు పోస్తే ముద్దగా అవుతుంది కాబట్టి, కాస్త పల్చగా రావడానికి అదనంగా ఒక గ్లాసు నీళ్లు కలుపుకోవాలి. కుక్కర్‌కు మూత పెట్టి, మధ్యస్థ మంటపై మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి.

ముందుగా ఒక పాన్‌లో ఒక టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని, చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. పప్పు వేయించడం వల్ల హల్వాకు మంచి రుచి, కమ్మటి వాసన వస్తుంది. పప్పును మాడకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత వీటిని కుక్కర్‌లోకి తీసుకోవాలి. కుక్కర్‌లోకి తీసుకున్న పెసరపప్పును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. మూడు గ్లాసుల నీళ్లు పోస్తే ముద్దగా అవుతుంది కాబట్టి, కాస్త పల్చగా రావడానికి అదనంగా ఒక గ్లాసు నీళ్లు కలుపుకోవాలి. కుక్కర్‌కు మూత పెట్టి, మధ్యస్థ మంటపై మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి.

2 / 5
విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి, ఉడికిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు కూడా. మెత్తగా ఎనిపిన పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి, అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
అదే నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసి, చిన్న మంటపై బాగా వేయించాలి. గోధుమపిండి రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది హల్వాకు బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గోధుమపిండి వేగిన తర్వాత, ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. మంటను చిన్న నుండి మీడియం స్థాయికి మార్చి, కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. పప్పు కాస్త చిక్కబడుతుంది.

4 / 5
మిశ్రమం చిక్కబడుతూ ఉండగా, మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. హల్వా మరింత చిక్కబడిన తర్వాత, ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో రెండు గ్లాసుల చక్కెర వేసుకోవాలి. బెల్లంతో కూడా ఈ హల్వాను చేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత మంటను తగ్గించి, చక్కెర పూర్తిగా కరిగి, హల్వా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగిన తర్వాత మిశ్రమం కొద్దిగా పల్చబడుతుంది, కానీ కలుపుతూ ఉంటే మళ్ళీ చిక్కబడుతుంది. మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వా చిక్కబడిన తర్వాత, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్  వేసి బాగా కలుపుకోవాలి.  హల్వా గట్టిపడిన తర్వాత, మరొక టేబుల్ స్పూన్ నెయ్యి,  దంచిన నాలుగు యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి పాన్ అంచుల నుండి విడిపోవడం, హల్వా పాన్‌కు అంటుకోకుండా రావడం మొదలుపెడుతుంది. హల్వా రెడీ  స్టవ్ ఆపి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.

5 / 5
Follow Us
డెబ్యూలో ఫ్లాప్ అంటూ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంబోజ్

సీతమ్మగా సాయి పల్లవి నటన అద్భుతం.. పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంది

దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని ఎందుకు పూజిస్తారంటే

అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా

రైల్వేస్టేషన్‌లో డబ్బులే డబ్బులు.. లెక్కించలేక అలసిపోయిన మెషిన్

దీపావళి రోజున మీ రాశి ప్రకారం ఈ పని చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం

మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?

కెప్టెన్సీ ఇస్తేనే వస్తా.. పాండ్యాకు షాకిచిన ఫ్రాంచైజీ..!

ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ.. అరగంటకే..
ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ.. అరగంటకే..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?