AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Tendulkar: అదంతా తూచ్.. సచిన్ కూతురికి పెళ్లి ఫిక్స్.. వరుడు గిల్ కాదు ఎవరంటే ?

Sara Tendulkar: సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తన 29వ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో తండ్రి సచిన్, తల్లి అంజలి, వదిన సానియా చందోక్ సారాకు మంచి జీవిత భాగస్వామి దొరకాలని ఆకాంక్షించారు.

Sara Tendulkar: అదంతా తూచ్.. సచిన్ కూతురికి పెళ్లి ఫిక్స్.. వరుడు గిల్ కాదు ఎవరంటే ?
Sara Tendulkar
Rakesh
|

Updated on: Nov 05, 2026 | 2:30 PM

Share

Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇటీవల తన 29వ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సారా పుట్టినరోజు అక్టోబర్ 12న జరిగినప్పటికీ ఆ వేడుకలో కుటుంబ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను నవంబర్ 4 రాత్రి షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సారాకు మంచి లైఫ్ ఫార్టనర్ దొరకాలని తండ్రి సచిన్, వదిన సానియా చందోక్ కోరుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో సారా పెళ్లి ఎప్పుడు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

సారా పెళ్లిపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ వీడియోలో సచిన్ తన కూతురికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది నీకు నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి, మంచి జీవిత భాగస్వామి దొరకాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆ తర్వాత ఇక ఎక్కువ మాట్లాడకూడదంటూ నవ్వుతూ తన మాటలను ఆపేశారు. అంతేకాదు నువ్వు ఇలాగే అందరిలో సానుకూలతను పంచుతూ ఉండాలని ఆకాంక్షించారు. సచిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. కూతురి పెళ్లి గురించి తండ్రి సరదాగా ప్రస్తావించడం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ ఏడాదే మంచి అబ్బాయి దొరకాలి

సారా వదిన, అర్జున్ టెండూల్కర్ భార్య సానియా చందోక్ కూడా వీడియోలో తన విషెస్ తెలిపారు. ఈ ఏడాదే నీకు మంచి జీవిత భాగస్వామి దొరకాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు, పెళ్లి చేసుకునే వ్యక్తి ముంబైలోని పెర్రీ క్రాస్ రోడ్ ప్రాంతంలో నివసించే వ్యక్తి అయితే బాగుంటుందని సరదాగా అన్నారు. అలా అయితే నువ్వు ఎప్పుడూ మా దగ్గరే ఉండొచ్చని నవ్వుతూ చెప్పారు. సారా కుటుంబం నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉండే వ్యక్తి తనకు వరుడిగా రావాలని సానియా కోరుకోవడం వీడియోలో నవ్వులు పూయించింది.

అంజలి కోరిక ఇదే

సారా తల్లి అంజలి టెండూల్కర్ తన కూతురికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, నీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇక సోదరుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం చాలా క్లుప్తంగా స్పందించారు. హ్యాపీ బర్త్‌డే.. అంతే అంటూ సరదాగా విషెస్ చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. మరోవైపు అర్జున్ అత్త గౌరికా ఘాయ్ చందోక్ కూడా సారాకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చారు. ఈ ఏడాది అర్జున్, సానియాకు కవల పిల్లలు పుట్టాలని, నువ్వు వారికి పిన్ని కావాలని కోరుకున్నారు. దీనికి సారా కూడా సంతోషంగా స్పందించారు.

సారా పెళ్లి ఎప్పుడు?

ఈ వీడియోలో కుటుంబ సభ్యుల మాటలు విన్న అభిమానులు సారా పెళ్లి గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే సారా పెళ్లి ఖరారైనట్లు కానీ, త్వరలో వివాహం జరగబోతున్నట్లు కానీ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ వ్యాఖ్యలను కుటుంబ సభ్యుల సరదా విషెస్‌గానే చూడాలి. 1997 అక్టోబర్ 12న జన్మించిన సారా ప్రస్తుతం 29 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిట్‌నెస్, వెల్‌నెస్ రంగంలో వ్యాపార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముంబైలో పిలేట్స్ అకాడమీ ఎక్స్ సారా టెండూల్కర్ పేరుతో వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. గతంలో క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ఆమె లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ, వారిద్దరి సంబంధంపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సచిన్ కూతురికి పెళ్లి ఫిక్స్.. వరుడు గిల్ కాదు ఎవరంటే ?
సచిన్ కూతురికి పెళ్లి ఫిక్స్.. వరుడు గిల్ కాదు ఎవరంటే ?
డెబ్యూలో ఫ్లాప్ అంటూ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంబోజ్
డెబ్యూలో ఫ్లాప్ అంటూ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంబోజ్
సీతమ్మగా సాయి పల్లవి నటన అద్భుతం.. పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంది
సీతమ్మగా సాయి పల్లవి నటన అద్భుతం.. పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంది
దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని ఎందుకు పూజిస్తారంటే
దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని ఎందుకు పూజిస్తారంటే
అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా
అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా
రైల్వేస్టేషన్‌లో డబ్బులే డబ్బులు.. లెక్కించలేక అలసిపోయిన మెషిన్
రైల్వేస్టేషన్‌లో డబ్బులే డబ్బులు.. లెక్కించలేక అలసిపోయిన మెషిన్
దీపావళి రోజున మీ రాశి ప్రకారం ఈ పని చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
దీపావళి రోజున మీ రాశి ప్రకారం ఈ పని చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
కెప్టెన్సీ ఇస్తేనే వస్తా.. పాండ్యాకు షాకిచిన ఫ్రాంచైజీ..!
కెప్టెన్సీ ఇస్తేనే వస్తా.. పాండ్యాకు షాకిచిన ఫ్రాంచైజీ..!
ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ.. అరగంటకే..
ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ.. అరగంటకే..