Swachhata Campaign 2025: దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత పఖ్వాడా క్యాంపెయిన్.. పూర్తి వివరాలివే
2 Oct with Nationwide Cleanliness Activities: మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛత పఖ్వాడా క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఈ ప్రచారం సెప్టెంబర్ 17న ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ముగిసే ఈ దేశవ్యాప్త ఉద్యమం స్వచ్ఛత హి సేవ (SHS) 2025తో సమన్వయం..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛత పఖ్వాడా క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఈ ప్రచారం సెప్టెంబర్ 17న ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ముగిసే ఈ దేశవ్యాప్త ఉద్యమం స్వచ్ఛత హి సేవ (SHS) 2025తో సమన్వయం చేయబడుతుంది. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పరిశుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన దేశం కోసం మంత్రిత్వ శాఖ నిబద్ధతను బలోపేతం చేస్తూ శాస్త్రి భవన్, జీవన్ తారా భవనంలో ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ చేపట్టనున్నారు. ఆది కర్మయోగి అభియాన్ కింద ఆది సేవాపర్వ్ (సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2) లో భాగంగా దేశవ్యాప్తంగా గిరిజనులు ఎక్కువగా నివసించే అన్ని గ్రామాలలో స్వచ్ఛతా హీ సేవ 2025 కూడా నిర్వహించబడుతుంది.
470కిపైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) పరిశుభ్రత, పర్యావరణ అనుకూల పద్ధతులపై అవగాహన కల్పించడానికి విద్యార్థుల నేతృత్వంలోని పోటీలు, డిబేట్‌లు, సృజనాత్మక కార్యకలాపాలు నిర్వహించనున్నారు. 29 గిరిజన పరిశోధనా సంస్థలు (TRI) అధ్యాపకులు, పరిశోధకులు, స్థానిక గిరిజన సంఘాల భాగస్వామ్యంతో క్యాంపస్, కమ్యూనిటీ స్థాయి శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కార్యాలయాల సిబ్బందితో శాస్త్రి భవన్, జీవన్ తారా భవనంలో ఇంటెన్సివ్ క్లీనింగ్ కార్యకలాపాలు చేపడుతారు. గిరిజన ప్రాబల్య గ్రామాలు అవగాహన ప్రచారాలకు నాయకత్వం వహిస్తూ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ పిలుపుతో ప్రజలను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు పిలుపునిచ్చారు.
పరిశుభ్రత అనేది ఉమ్మడి బాధ్యత. EMRS విద్యార్థులు, TRIలు, గిరిజన సంఘాలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా వికసిగ్ భారత్ -2047 దార్శనికతకు అనుగుణంగా గౌరవం, ఆరోగ్య సంస్కృతిని పెంపొందిస్తున్నామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాలోరామ్ అన్నారు. గిరిజన మంత్రిత్వ శాఖ స్వచ్ఛత పఖ్వాడా జన భాగీదారీ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. గిరిజన యువత ముందంజలో ఉండటంతో ఈ ప్రచారాలు నిజమైన ప్రజా ఉద్యమాలుగా రూపాంతరం చెందుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయ్కే అన్నారు.
స్వచ్ఛ్, విక్షిత్ భారత్ వైపుకి ఇదొక ముందడుగు..
స్వచ్ఛతా హీ సేవ 2025 ఐదు కీలక అంశాలను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తుంది. నిర్లక్ష్యం చేయబడిన ప్రదేశాలను శుభ్రమైన ప్రజా స్థలాలుగా మార్చడం. గిరిజన సంస్థలలో పర్యావరణ అనుకూల ఉత్సవాలు, వ్యర్థ రహిత వేడుకలు జరపడం. సఫాయి మిత్ర సురక్ష, సమ్మాన్ – పారిశుధ్య కార్మికులకు గుర్తింపు ఇవ్వడం. పరిశుభ్రమైన గ్రామాలు, ODF ప్లస్ నమూనాల కోసం విద్యార్థులు, యువతకు మద్దతు ఇవ్వడం. 25 సెప్టెంబర్ 2025న కమ్యూనిటీ నేతృత్వంలోని స్వచ్ఛంద శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం.. అన్ని గిరిజన సంఘాలు, సంస్థలు, పౌరులు ఈ ప్రచారంలో చేరాలని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. ఇది మహాత్మా గాంధీకి నివాళి, విక్షిత్ భారత్ 2047 వైపు ఓ ముందడుగుగా గిరిజన మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








