AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: గిరిజనుల కోసం మోదీ సర్కార్ సూపర్ స్కీమ్.. ఆది కర్మయోగి అభియాన్‌తో 11 కోట్ల మందికి లబ్ధి..

ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని 11కోట్ల మంది గిరిజనులకు దీని ద్వారా లబ్ది చేకూరనుంది. ఆది కర్మయోగి అభియాన్ లక్ష్యం వికసిత్ భారత్ కలను సాకారం చేయడం.

PM Modi: గిరిజనుల కోసం మోదీ సర్కార్ సూపర్ స్కీమ్.. ఆది కర్మయోగి అభియాన్‌తో 11 కోట్ల మందికి లబ్ధి..
Modi Launches Adhi Karmayogi Abhiyan
Krishna S
|

Updated on: Sep 17, 2025 | 9:54 PM

Share

కేంద్రం జన్ జాతీయ గౌరవ్ వర్ష్‌లో భాగంగా గిరిజనుల కోసం ఒక అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చింది. అదే ఆది కర్మయోగి అభియాన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన అభివృద్ధి కార్యక్రమం. దేశంలోని లక్ష గ్రామాలు, 11 కోట్ల మంది గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆది కర్మయోగి అంటే “గిరిజన నాయకుడు” అని అర్థం. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆది కర్మయోగి అభియాన్ లక్ష్యం వికసిత్ భారత్ కలను సాకారం చేయడం. దీనిలో భాగంగా ప్రభుత్వం అందించే సేవలు ప్రతి గిరిజన పౌరుడికి చివరి అడుగు వరకు చేరుతాయని ప్రధాని తెలిపారు. ఈ కార్యక్రమం గిరిజన వర్గాలను ప్రభుత్వ పథకాలతో నేరుగా కలుపుతుందని చెప్పారు.

ఈ పథకం కింద 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక బృందాల మహిళలు, గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీళ్లంతా గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా చూస్తారు. ప్రతి గ్రామానికి ఒక ‘ఆది సేవా కేంద్రం’ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రజలు అన్ని ప్రభుత్వ సేవలను ఒకే చోట పొందవచ్చు. ఆది వాణి యాప్ అనే కొత్త యాప్‌ను కూడా తీసుకొచ్చారు. ఇది గిరిజన భాషల్లోనే అధికారులతో మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది.

గ్రామాలే తమ భవిష్యత్తును రాసుకుంటాయి

ఈ పథకంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘ఆది సేవా పర్వ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ 15 రోజుల్లో ప్రతి గ్రామం తమ భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేకమైన ‘విజన్ డాక్యుమెంట్’ను తయారు చేసుకుంటుంది. దీనిని గిరిజన విజన్ 2030 అని పిలుస్తారు. అంటే గ్రామాల ప్రజలే తమ భవిష్యత్తు ఎలా ఉండాలో వారే ప్లాన్ చేసుకుంటారు!

యువతదే భవిష్యత్తు!

ఐఐటీ, ఐఐఎం లాంటి పెద్ద కాలేజీల స్టూడెంట్స్ కూడా ఈ పథకంలో భాగమవుతారు. వాళ్లు తమ నైపుణ్యాలతో గిరిజన గ్రామాల అభివృద్ధికి సహకరిస్తారు. దీనివల్ల గిరిజనులకు మంచి ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు అందుతాయి. మొత్తం మీద, ఈ ‘ఆది కర్మయోగి అభియాన్’ మన దేశాన్ని విక్షిత్ భారత్‌గా మార్చే దిశలో ఒక పెద్ద అడుగు అని చెప్పొచ్చు.

సాధికారత ఉద్యమం

ఈ అభియాన్ కేవలం ఒక కార్యక్రమం కాదని.. ఇది గిరిజన సమాజాన్ని అభివృద్ధి చేసే సాధికారత ఉద్యమం అని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం అన్నారు. ఈ ప్రయత్నం భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక చారిత్రాత్మక అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.