టీనేజ్ ఫోటోస్ షేర్ చేసిన భూమిక.. 28 ఏళ్ల క్రితం ఎలా ఉందో చూశారా..

Rajitha Chanti

Pic credit - Instagram

09 April 2026

హీరోయిన్ భూమిక 28 ఏళ్ల నాటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

భూమిక 2000 సంవత్సరంలో 'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతో అందం, అభినయంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. 

ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

దీంతో తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి టాప్ హీరోయిన్ గా మారింది.

సల్మాన్ ఖాన్ నటించిన 2003 హిందీ చిత్రం 'తేరే నామ్'తో భూమిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ చిత్రాలలో నటించింది.

నటి భూమిక 28 ఏళ్ల క్రితం నాటి తన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "చాలా కాలం క్రితం... ఛాయాచిత్రాలలో బంధించబడిన జీవితం..

1998లో తీసిన చిత్రాలు. 28 సంవత్సరాలు గడిచిపోయాయి. అదొక యుగంలా అనిపిస్తుంది. జీవితంలో, నేను కుమార్తె, భార్య, తల్లి, సహా అనేక పాత్రలు పోషించాను.

 ప్రస్తుతం భూమిక షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇటీవల గుణశేఖర్ తెరకెక్కించిన యూఫోరియా అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.