AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2026 Result Date: కాస్త సులువుగానే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలు బుధవారం (ఏప్రిల్ 8)తో ప్రశాంతంగా ముగిశాయి. దేశ వ్యాప్తంగా సుమారు 11.23 లక్షల మంది విద్యార్ధులకు 566 పరీక్ష కేంద్రాల్లో 318 నగరాల్లో ఈ పరీక్షలు జరిగాయి. జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ 1తో పోలిస్తే ఏప్రిల్ సెషన్ 2 ప్రశ్నపత్రాలు కొంత సులభంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు..

JEE Main 2026 Result Date: కాస్త సులువుగానే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?
JEE Main session 2 answer key
Srilakshmi C
|

Updated on: Apr 09, 2026 | 2:34 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలు బుధవారం (ఏప్రిల్ 8)తో ముగిశాయి. ఏప్రిల్ 7వ తేదీన పేపర్ 2 ఏ, 2బీ (బీఆర్క్‌, బీప్లానింగ్‌) పరీక్షలు జరిగాయి. చివరి రోజున కేవలం రెండో షిఫ్టులో మాత్రమే పరీక్షలు జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 11.23 లక్షల మంది విద్యార్ధులకు 566 పరీక్ష కేంద్రాల్లో 318 నగరాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఇందులో పేపర్ 1 (బీఈ/బీటెక్‌) పరీక్షకు సుమారు 11.06 లక్షల మంది భారతీయ విద్యార్ధులు రాశారు. ఇక విదేశాలకు చెందిన విద్యార్ధులు 4,229 మంది రిజిస్టర్ చేసుకోగా.. ఇందులో 93 శాతం పరీక్షలకు హాజరయ్యారు. పేపర్ 2 (బీఆర్క్‌/బీప్లానింగ్‌) పరీక్షకు దాదాపు 55 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇందులో 73 శాతం మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 6 రోజుల్లో 10 సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి.

జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ 1తో పోలిస్తే ఏప్రిల్ సెషన్ 2 ప్రశ్నపత్రాలు కొంత సులభంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సెషన్‌ 2లో అన్ని సెషన్లలో తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయిలో ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. ఇక జేఈఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్ (సెషన్ 2) ఫలితాలు గతంలో జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నాలుగో వారంలో విడుదలకానున్నాయి. పరీక్షలు ముగియడంతో ఆన్సర్‌ కీ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీలతోపాటు ప్రశ్నాపత్రాలు, రెస్సాన్స్ షీట్లను ఏప్రిల్‌ 11వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది.

జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ 2 ఆన్సర్‌ కీ, క్వశ్చన్‌ పేపర్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏప్రిల్ 11న ఆన్సర్‌ కీ విడుదలైన తర్వాత అభ్యంతరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే తెలియజేయవల్సి ఉంటుంది. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఆన్సర్‌ కీని రూపొందించి.. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. రెండు సెషన్లలో అభ్యర్థులు సాధించిన అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుని, నార్మలైజేషన్ పద్ధతిలో తుది ర్యాంకులను ఏప్రిల్ 20న ప్రకటిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగానే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హతను నిర్ణయిస్తారు. తొలి 2.50 లక్షల ర్యాంకులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. ఇక మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఒకే రోజులో నిర్వహిస్తారు. అభ్యర్ధులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుం

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 ప్రశ్నపత్రాల విడుదల: ఏప్రిల్ 9, 2026
  • ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2026.
  • అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం
  • ఫలితాల విడుదల తేదీ: ఏప్రిల్ 20, 2026.

జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ 2 ఆన్సర్‌ కీ, క్వశ్చన్‌ పేపర్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us