AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఊహించని సంఘటనతో గందరగోళం.. క్లైమాక్స్ చూస్తే అంతే ఇక.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

ప్రస్తుతం ఓటీటీలో మలయాళీ చిత్రాలకు వస్తున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓ మూవీ దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంచనలం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Apr 09, 2026 | 1:16 PM

Share
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన అత్యంత స్ఫూర్తిదాయకమైన చిత్రాలలో 'ఉయరే' (Uyare) ఒకటి. పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

1 / 5
కథ విషయానికి వస్తే.. పల్లవి రవీంద్రన్ (పార్వతి) అనే ఒక సామాన్య యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్నప్పటి నుండి పైలట్ కావాలన్నది ఆమె ఏకైక కల. ఎంతో కష్టపడి ఏవియేషన్ అకాడమీలో చేరుతుంది. అయితే, ఆమె ప్రియుడు గోవింద్ (ఆసిఫ్ అలీ) అత్యంత స్వార్థపరుడు. ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందనే భయంతో, విచక్షణ కోల్పోయి పల్లవిపై యాసిడ్ దాడి చేస్తాడు.

2 / 5
ఈ ఘోర ప్రమాదంలో పల్లవి తన ముఖాన్ని, చూపును (ఒక కన్ను), పైలట్ కావాలనే తన కెరీర్‌ను కోల్పోతుంది. ఆ చీకటి నుండి ఆమె తిరిగి ఎలా కోలుకుంది, తన కలలను ఎలా నిజం చేసుకుంది అనేదే ఈ చిత్ర సారాంశం. యాసిడ్ దాడికి గురైన బాధితురాలిగా పార్వతి నటన అద్భుతమనే చెప్పాలి. శారీరక, మానసిక వేదనను ఆమె పండించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.

3 / 5
జీవితంలో సర్వస్వం కోల్పోయామని అనుకున్నప్పుడు, మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా ఎలా ఎదగాలి అనేది పల్లవి పాత్ర మనకు నేర్పుతుంది. టొవినో థామస్ పోషించిన విశాల్ పాత్ర, ఒక వ్యక్తికి కష్టాల్లో తోడుగా నిలబడటం ఎంత ముఖ్యమో వివరిస్తుంది. ప్రేమ పేరుతో భాగస్వామిని నియంత్రించడం ఎంత ప్రమాదకరమో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

4 / 5
ఆసిఫ్ అలీ పాత్ర ద్వారా అభద్రతా భావం కలిగిన ప్రేమికుడి మనస్తత్వాన్ని దర్శకుడు చక్కగా చూపించారు.  మను అశోకన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పీ సుందర్ అందించిన సంగీతం హైలెట్ అయ్యింది. 'ఉయరే' అంటే మలయాళంలో 'ఎత్తు' అని అర్థం. ఈ సినిమా కేవలం ఒక బాధితురాలి కథ మాత్రమే కాదు, తనను తాను నిరూపించుకోవాలనుకునే ప్రతి మహిళా పోరాటం.

5 / 5
Follow Us
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?

ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?

కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..

భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?

పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..

రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!

చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్