AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ లివర్ vs మటన్ లివర్.. ఏది తింటే బలం, ఆరోగ్యం..

మటన్, చికెన్ లివర్ (కాలేయం) పోషకాల గని.. మటన్ లివర్, చికెన్ లివర్ రెండూ పోషక సమృద్ధిని కలిగి ఉంటాయని.. వీటితో పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి మేక, కోడి లివర్ లు ఐరన్, విటమిన్ B12, విటమిన్ A,, ప్రోటీన్ల అద్భుతమైన వనరులు.. ఇవి రక్తహీనతను తగ్గించి, కంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. .

చికెన్ లివర్ vs మటన్ లివర్.. ఏది తింటే బలం, ఆరోగ్యం..
Chicken Liver - Mutton Liver
Shaik Madar Saheb
|

Updated on: Apr 09, 2026 | 4:31 PM

Share

నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు.. అయితే.. కోడి, మేకలోని.. లివర్ మంచి పోషకాహారం.. అధిక పోషక విలువలు కలిగినవి.. చాలా మందికి చికెన్ లివర్, మటన్ లివర్‌లలో ఏది మంచిది.. ఎంత మోతాదులో తినాలి అనే సందేహాలు ఉంటాయి.. అయితే.. ఈ రెండు రకాల లివర్‌లు అధిక పోషక విలువలు.. ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, విటమిన్ A లాంటి అద్భుతమైన వనరులు ఉన్నాయి.. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడతాయి..

పోషక విలువలు:

మటన్ లివర్, న్ లివర్ రెండూ పోషకాల గని. 100 గ్రాముల లివర్‌లో సాధారణంగా 160 నుండి 170 కేలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్‌ల విషయానికి వస్తే, 20-25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కొవ్వులు దాదాపు 5 గ్రాములు ఉంటాయి. లివర్‌లో కొలెస్ట్రాల్ శాతం (400-500 మిల్లీగ్రాములు/100గ్రాములు) అధికంగా ఉన్నప్పటికీ.. ఇది పెద్ద ఆరోగ్య సమస్యగా పరిగణించరు.

ముఖ్యమైన విటమిన్లు: విటమిన్ A – విటమిన్ B12

ఈ రెండు రకాల లివర్‌లలో ప్రధానంగా విటమిన్ A, విటమిన్ B12 అధిక మోతాదులో ఉంటాయి.

విటమిన్ A: విటమిన్ A విషయానికి వస్తే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, చికెన్ లివర్‌లో మటన్ లివర్ కన్నా విటమిన్ A ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మటన్ లివర్‌లో దాదాపు 6000 యూనిట్ల విటమిన్ A ఉండగా, 100 గ్రాముల చికెన్ లివర్‌లో 16000 యూనిట్ల విటమిన్ A ఉంటుంది. విటమిన్ A కంటి చూపు, రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైనది.

విటమిన్ B12: విటమిన్ B12 విషయంలో మాత్రం మటన్ లివర్ గొప్ప ఎంపిక.. 100 గ్రాముల చికెన్ లివర్‌లో సుమారు 16 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉండగా, ఇది రోజువారీ అవసరానికి ఐదు నుండి ఆరు రెట్లు ఎక్కువ. అదే 100 గ్రాముల మటన్ లివర్‌లో దాదాపు 85 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది.. ఇది చికెన్ లివర్ కన్నా ఐదు రెట్లు ఎక్కువ .. రోజువారీ అవసరానికి దాదాపు 30 రెట్లు అధికం. విటమిన్ B12 లోపం నాడీ సంబంధిత వ్యాధులకు (న్యూరోపతి), తీవ్రమైన రక్తహీనత (పెర్నీషియస్ అనీమియా)కు దారితీస్తుంది. ముఖ్యంగా శాఖాహారులకు విటమిన్ B12 లభించడం కష్టం కాబట్టి.. మాంసాహారం తినేవారికి లివర్ అద్భుతమైన వనరు.

విటమిన్ల వినియోగం – జాగ్రత్తలు:

విటమిన్ A, విటమిన్ B12ల మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. విటమిన్ B12 నీటిలో కరిగే విటమిన్ కాబట్టి, అధిక మోతాదులో తీసుకున్నా మిగిలినవి మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి.. కాబట్టి అధిక వినియోగం వల్ల టాక్సిసిటీ సమస్యలు ఉండవు.

అయితే, విటమిన్ A కొవ్వులో కరిగే విటమిన్. అధిక మోతాదులో విటమిన్ A తీసుకుంటే, అది శరీరంలో (ముఖ్యంగా మెదడు, లివర్ వంటి కొవ్వు నిల్వ ఉండే ప్రాంతాలలో) పేరుకుపోయి హైపర్విటమినోసిస్ Aకి దారితీస్తుంది. ఇది మెదడు లేదా లివర్ సంబంధిత సమస్యలను కలిగించవచ్చు.

ఎవరు ఎంత తినాలి?

పెద్దలు: పెద్దవారు వారానికి ఒకసారి 100 గ్రాముల మటన్ లివర్ లేదా చికెన్ లివర్‌ను ధారాళంగా తినవచ్చు.. ఎటువంటి సమస్య ఉండదు.

పిల్లలు: పిల్లలకు వారానికి ఒకసారి 50 గ్రాముల లివర్‌ను ఇవ్వవచ్చు. పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు వారానికి రెండుసార్లు కూడా 50 గ్రాముల లివర్ ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలకు విటమిన్ B12 అవసరం ఉన్నప్పటికీ, విటమిన్ A అధిక మోతాదులో తీసుకోవడం వల్ల సమస్యలు రావచ్చు. విటమిన్ A, రెటినాల్ రూపంలో, మొదటి మూడు నెలల్లో (ఫస్ట్ ట్రైమెస్టర్) అధికంగా తీసుకుంటే పిండంలో పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీయవచ్చు. అందువల్ల, గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలల్లో వారానికి 50 గ్రాములకు మించి లివర్‌ను తీసుకోకూడదు. ముఖ్యంగా చికెన్ లివర్‌లో విటమిన్ A అధికంగా ఉంటుంది. కాబట్టి, అది తక్కువ మోతాదులో తినాలి. మొదటి మూడు నెలలు దాటిన తర్వాత, రక్తహీనత లేదా ఇతర పోషక లోపాలు ఉన్నప్పుడు వారానికి 100 గ్రాముల వరకు లివర్‌ను తీసుకోవచ్చు.

ఇలాంటి వారు లివర్‌కు దూరంగా ఉండటమే బెటర్

మటన్ లివర్, చికెన్ లివర్ రెండూ పోషకాలతో నిండిన గొప్ప ఆహారాలు. విటమిన్ B12 కోసం మటన్ లివర్ ఉత్తమం.. కాగా, విటమిన్ A కోసం చికెన్ లివర్ మెరుగైనది. పోషకాలను పూర్తిగా వినియోగించుకోవడానికి, అధిక విటమిన్ A వినియోగంతో వచ్చే సమస్యలను నివారించడానికి జాగ్రత్తగా, సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. చికెన్ లివర్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయని భావించడం సరికాదు, ప్రతిదానికీ దాని సొంత ప్రత్యేకతలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు. అయితే.. మటన్, చికెన్ లివర్ లలో కొలెస్ట్రాల్, ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us