AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!

పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాజస్థాన్‌లో అఖా తీజ్ (అక్షయ తృతీయ), పీపల్ పౌర్ణమి వంటి పవిత్రమైన రోజులలో అధిక సంఖ్యలో జరిగే బాల్య వివాహాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!
Rajasthan Government
Balaraju Goud
|

Updated on: Apr 09, 2026 | 4:12 PM

Share

పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాజస్థాన్‌లో అఖా తీజ్ (అక్షయ తృతీయ), పీపల్ పౌర్ణమి వంటి పవిత్రమైన రోజులలో అధిక సంఖ్యలో జరిగే బాల్య వివాహాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రెండు పవిత్రమైన రోజులలో పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. తద్వారా వారి వయస్సును ధృవీకరించి, నిర్ధారించవచ్చని అధికారులు భావిస్తన్నారు.

రాజస్థాన్ ప్రభుత్వం బాల్య వివాహాలను నివారించడం కోసం 181 , 100 హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేయడంతో పాటు, 24 గంటల పర్యవేక్షణ, అవగాహన ప్రచారాలు, కఠిన చర్యలను చేపట్టింది. వాస్తవానికి, రాజస్థాన్‌లోని అనేక గ్రామాలలో బాల్య వివాహాల ఆచారం ఇప్పటికీ ప్రబలంగా ఉంది. అఖా తీజ్, పీపల్ పౌర్ణమి వంటి పవిత్రమైన రోజులలో బాల్య వివాహాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పక్కా ఏర్పాట్లు చేసింది.

బాల్య వివాహాలను నివారించడానికి, రాష్ట్ర ప్రభుత్వం 2006 వివాహ నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం, బాల్య వివాహాన్ని ఒక నేరంగా పరిగణిస్తారు. దానిని నివారించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపడుతుంది. అక్షయ తృతీయ, రావి పౌర్ణమి రోజులలో అత్యధిక సంఖ్యలో బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాలలో జరుగుతాయి. కాబట్టి, ఈ పండుగల వంటి సందర్భాలలో అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

బాల్య వివాహాలను నివారించడానికి, అధికార యంత్రాంగం టెంట్ హౌజ్ యజమానులు, మిఠాయి వ్యాపారులు, పూజారులు, సంగీత బృందాలు, రవాణాదారులను కూడా బాధ్యులుగా చేసింది. వారు బాల్య వివాహాలలో పాల్గొనబోరని హామీ ఇవ్వాలని కోరడంతో పాటు, వారికి చట్టం గురించి కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, వారు బాల్య వివాహాలలో పాలుపంచుకున్నట్లు రుజువైతే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us