Milk Prices May Hike: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్(Petrol And Diesel) ధరలు నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే నెల 1వ తేదీ నుంచి పాల ధరలు రూ. 12 మేరకు పెంచాలని ఉత్పత్తిదారులు నిర్ణయానికి వచ్చారు. దీనితో లీటర్ పాల ధర రూ. 55 చేరనుంది. ఈ నెల 23న కూరగాయలు, పాల ఉత్పత్తిదారుల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో లీటర్ పాల ధర రూ. 43గా ఉండగా.. అది కాస్తా రూ. 55కి చేరనుంది. (Milk Prices May Hike)
రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా పాల ధరలు పెంచాలని నిర్ణయించినట్లు రత్లామ్(Ratlam) మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హీరాలాల్ చౌదరీ వెల్లడించారు. ఒక్కో బర్రెను రూ. లక్ష నుంచి 1.5 లక్షలు పెట్టి కొనుగోలు చేశామని.. పెట్రోల్ ధరలు అమాంతం పెరగడం కారణంగా రవాణా ఖర్చులు, దానా ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ పాల ధరలను పెంచలేదని.. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల పాల ధరను రూ. 55కి పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాగా, పెంచిన పాల ధరలను అనుమతించకపోతే ఉత్పత్తిని నిలిపివేస్తామని హెచ్చరించారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా 12 రోజులపాటు పెరిగిన పెట్రో ధరలు.. వరుసగా మూడో రోజు స్థిరంగా ఉన్నాయి. దేశీయ చమురు సంస్థలు మంగళవారం నాడు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35పైసల మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93 కి చేరగా.. డీజిల్ ధర రూ.81.32గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.34కి చేరగా.. డీజిల్ ధర రూ.88.44కి చేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.93.98 ఉండగా.. డీజిల్ రూ.86.21కి పెరిగింది.
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!
Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్ చేసిన రియల్ హీరో.. చివరికి ఏమైందంటే.!
ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?